టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నహీరో ఆశిష్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. జనవరి 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇక దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టి ప్రమోషన్స్ ఏ రకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చూశాం కూడా. ఇంకా రిలీజ్ కు వారం రోజులు ఉంది కాబట్టి ఈ వారం రోజులు గట్టిగానే సినిమా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే రేపు ట్రైలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు అంటే జనవరి 8న సాయంత్రం 6 గంటలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు మూహూర్తం ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
We can’t hold our excitement any longer!
NTR @tarak9999 to launch the trailer of #RowdyBoys tomorrow @ 6PM. #RowdyBoysOnJan14th #Ashish @anupamahere @ThisIsDSP @HarshaKonuganti @Madhie1 @SVC_official @adityamusic #sahidevvikram #karthikrathnam #tejkurapati @komaleeprasad pic.twitter.com/PRSx5uTL93
— Sri Venkateswara Creations (@SVC_official) January 7, 2022
ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. అంతేకాకుండా దిల్ రాజు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. మరి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో.. ఈ వారసుడు ఎంత వరకూ తన మార్క్ ను చూపించగాలుగుతాడో చూద్దాం..
కాగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: