కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Sharwanand

ట్యాగ్ · 36 కథనాలు · పేజీ 2

రిలీజ్ అప్‌డేట్

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్

అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 'మహా సముద్రం' సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా.. ఇందులో శర్వానంద్ - సిద్దార్థ్ ఇద్దరూ ఓ పడవ పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్

సంక్రాంతి అయిపోయింది.. పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసి వెళ్లిపోయాయి. ఇక ఫిబ్రవరికి చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో సినిమా కూడా చేరిపోయింది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మహాసముద్రం షూటింగ్ స్టార్ట్

శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

శర్వా ద్విభాషా చిత్రం.. షూటింగ్ పూర్తి

టాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా షూటింగ్ లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు చాలామంది షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. గతకొద్ది రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఈ సందర్భంగా శర్వా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"మహాసముద్రం " మూవీ థీమ్ పోస్టర్ రిలీజ్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టౌనర్ "మహాసముద్రం "మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. 7 సంవత్సరాల తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం. అదితి రావు హైదరీ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త లుక్ లో అదరగొడుతున్న శర్వా

ఈ మధ్య మన హీరోలు కొత్త కొత్త మేకోవర్ లు ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు ఈ లాక్ డౌన్ లు బాగా ఉపయోగించుకొని సిక్స్ ప్యాక్స్ కూడా చేసేసారు. అంతేకాదు సినిమా సినిమాకు తాము కొత్తగా ఉండటానికి తమ ప్రయత్నం తాము చేస్తూనే వుంటారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మాత్రం ఇలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోడు. ఐతే మొదటిసారిగా శర్వా కూడా స్టైలిష్ లుక్ లోకి వచ్చాడు. అంతేకాదు తన ఫోటోలని అభిమానులతో పంచుకోగా సూపర్ లుక్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఫోటోల్లో శర్వానంద్ చాలా స్టైలిష్, కూల్ గా కనిపిస్తున్నాడు. ట్రీండీ గెటప్ లో చూడగానే ఆకర్షించేలా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మొదలైన శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

నేను శైల‌జ ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈసినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా హీరో, హీరోయిన్‌పై ముహూర్తం షాట్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, ఫోర్టీన్‌ రీల్స్ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ.. ‘వినూత్నమైన…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

శర్వా 'శ్రీకారం' - 20 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి

కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి గత కొద్దిరోజులుగా చిత్రీకరణలో ఉన్నారు. కరోనా జాగ్రత్త లతో తిరుపతి పరిసర ప్రాంతాలలో 20 రోజులుగా నాన్ స్టాఫ్ గా షూటింగ్ లోనే ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా ఈ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శర్వా కొత్త ప్రాజెక్ట్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'

సినిమా థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయకపోయినా ... సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నా మన హీరోలు మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక కూడా వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మ‌హాస‌ముద్రం'లో అను ఇమ్మాన్యుయేల్‌

అజయ్ భూపతి దర్శకత్వంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న హీరో శ‌ర్వానంద్‌, ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'మ‌హాస‌ముద్రం'. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్‌ అదితి రావ్ హైద‌రిని ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మ‌రో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రగా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Aditi Rao Hydari To Play The Female Lead In Ajay Bhupathi Maha Samudram
సినిమా వార్తలు

"మహా సముద్రం " మూవీ లో అదితిరావు హైదరి

సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం " రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్దార్ద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ "మహా సముద్రం " మూవీలో హీరోయిన్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కన్ఫామ్ 'మహా సముద్రం'లో అదితి

అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. సినిమాతో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రలో శర్వా నటించబోతున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"శ్రీకారం "మూవీ షూటింగ్ పునః ప్రారంభం

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో పడిన విషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందికి గురి అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. సుమారు 6 నెలల తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యి చిత్ర పరిశ్రమ కళ కళ లాడుతుంది. కరోనా టైమ్ లో షూటింగ్స్ నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. థియేటర్స్ రీ ఓపెనింగ్ తో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

శర్వా ద్విభాషా చిత్రం షూటింగ్ పునఃప్రారంభం

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. దాదాపు చాలా మంది ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ అయితే ఏకంగా ఇటలీకి పయనమయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా శర్వా కూడా షూట్ ను స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైనల్లీ వచ్చేసిన 'మహాసముద్రం' అఫీషియల్ అనౌన్స్ మెంట్

ఫైనల్లీ మహాసముద్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. అయితే ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గ‌మ్యం’ చిత్రాల త‌ర్వాత శ‌ర్వానంద్ చిర‌కాలం గుర్తుండిపోయే ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, బ‌ల‌మైన పాత్రను చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయ‌బోతున్నందుకు శ‌ర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు అని ట్వీట్ లో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ముగ్గురు నాయికలతో శర్వానంద్

యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో ఓ పిరియాడిక్ రొమాంటిక్ సాగా రాబోతున్న సంగతి తెలిసిందే. 1910 నుంచి 2021 వరకు సాగే ప్రేమకథా చిత్రమిది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో శర్వానంద్ సరసన ముగ్గురు నాయికలు సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చందు మొండేటి స్వయంగా వెల్లడించాడు.

Team TFNవాట్సాప్

షేర్