కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Krish

ట్యాగ్ · 35 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రకుల్ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. జాన్ అబ్రహామ్ "ఎటాక్ ", అర్జున్ కపూర్ "సర్దార్ &గ్రాండ్ సన్ ", అజయ్ దేవగన్ "మే డే "హిందీ మూవీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. "ఇండియన్ 2", "అయిలాన్ "తమిళ మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా పేరు అలా క్రిష్ గా మారింది

డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. నిజ జీవితానికి దగ్గరగా.. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ క్రిష్ స్టైలే వేరు. అందుకు గమ్యం, వేదం లాంటి సినిమాలే ఉదాహరణ. తొలి చిత్రం ‘గమ్యం’ నుంచి గ‌త చిత్రం ‘య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు` వ‌ర‌కు ఈ టాలెంటెడ్ టెక్నీషియ‌న్ రూపొందించిన సినిమాల‌న్నీ వేటిక‌వే ప్ర‌త్యేకంగా నిలుస్తాయి. అంతేకాదు.. సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో కూడా దిట్ట. ఇక ఈరోజు క్రిష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Rakul Preet Singh Shares An Interesting Update About Her Latest Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

క్రిష్ డెడికేషన్ - 35 రోజుల్లో.. టాకీ పూర్తి

డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. అంతేకాదు.. సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో కూడా దిట్ట. గతంలో బాలకృష్ణ 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ కూడా చాలా తొందరగా పూర్తి చేసి అందరూ షాక్ అయ్యేలా చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి షాకే ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అతిథి పాత్రలో రానా దగ్గుబాటి ?

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ తేజ్ , రకుల్ ప్రీత్ జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో రకుల్ ప్రీత్ గిరిజన యువతిగా నటిస్తున్నారు.ఈ మూవీ లో ఒక కీలక పాత్రకై హీరో రానా ను దర్శకుడు క్రిష్ సంప్రదించినట్టు , హీరో రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ లో జాయిన్ అయిన రకుల్ ప్రీత్

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ తేజ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేస్ లో రకుల్ ను సెప్టెంబర్ 25 వ తేదీ నార్కోటిక్ అధికారులు విచారించారు. అప్పటి నుండి రకుల్ షూటింగ్ లో పాల్గొనలేదు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

బ్యాక్ టు వర్క్ - మళ్లీ అడవుల్లోకి రకుల్

రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే గత కొద్దిరోజులుగా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలా రకుల్ నటిస్తున్నట్టు ఇటీవలే బయటకు వచ్చిన ఫొటోలను బట్టి అర్థమవుతూనే వుంది.

TFN Adminవాట్సాప్
Director Krish Shares An Adorable Pic From Formal Meeting Of Tollywood Movie Directors
సినిమా వార్తలు

ఒకేచోట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్

టాలీవుడ్ స్టార్ దర్శకులంతా ఒకే చోట కలిసి ఉండటం.. చిన్న పార్టీ చేసుకొని అందరూ కలిసీ తినడం చాలా అరుదుగా జరిగే విషయాలు. ఎప్పుడో ఏదైనా విషయం ఉంటే తప్పా కలుసుకునే అవకాశం ఉండదు. దానికి తోడు ఇప్పుడు కరోనా. కరోనా వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ... సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే కలిగింది. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపపడ్డాయి. ఒక పక్క సినీ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఒకరి నొకరు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమవ్వగా.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చరిత్రలో నాకు నచ్చిన వ్యక్తి ఆయనే.. మరి మీకు..?

డైరెక్టర్ క్రిష్ సినిమాలు చూస్తే ఆయన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. సమాజంలో పరిస్థితులు ఎలా వుంటాయో వాటినే ఆయన సినిమా రూపంలో చెప్తుంటారు. ఇది ఆయన చిత్రాలు చూసే వారెవరైనా ఒప్పుకుంటారు. ఇక సోషల్ మీడియాకు ఆయన కాస్త దూరం అని చెప్పొచ్చు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక పోస్ట్ చేసినా అది కొంచం ఆలోచింపచేసేదిలా ఉంటుంది.

TFN Adminవాట్సాప్
Director Krish Quashes The Rumors Of Stalling Pawan Kalyan Movie
సినిమా వార్తలు

క్రిష్ - పవన్ సినిమా.. అందులో నిజం లేదు..!

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-రకుల్ హీరో హీరోయిన్లుగా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. వెంటనే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమాను ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Director Krish To Come Up With A New Movie With This Fresh Combination
సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ - రకుల్ సినిమా లాంచ్

మెగా కాంపౌండ్ నుండి వెండి తెరకు పరిచయమవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇప్పటికే 'ఉప్పెన' సినిమా తెరకెక్కింది. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది.. ఎప్పుడో వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం అయ్యేవాడు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే సినిమాపై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ మూవీ లో రకుల్ ప్రీత్ ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " మూవీ తెలుగు రీమేక్ గా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కరోనాపై వేమన పద్యాలు..!

నార్మల్ గా ఉండే జీవితాలు కరోనా వల్ల ఒక్కసారిగా మారిపోయాయి. ఒకరికొకరు దగ్గరగా మాట్లాడుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఈ వైరస్ కు మొదట ప్రజలు భయపడినా ఇప్పుడు మాత్రం కాస్త ఆ భయం తగ్గినట్టుంది. దానికితోడు ప్రభుత్వం కూడా సడలింపులు చేయడంతో ప్రజలు కూడా బయటికి వచ్చేస్తున్నారు. ఇక ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు క్రియేటివిటీతో పోస్ట్లు క్రియేట్ చేస్తుంటే కొందరు ఫన్నీగా క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఎవరి క్రియేటివిటీ వారిది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రిష్ మూవీ లో హీరోయిన్ అనుష్క ?

సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మొఘలాయి కాలం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి "విరూపాక్ష " టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan To Play Dual Role In Krish Directorial
సినిమా వార్తలు

క్రిష్ చిత్రంలో ప‌వ‌న్ ద్విపాత్రాభిన‌యం?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో ఓ పిరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఎం.ఎం. కీర‌వాణి బాణీలు అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... మొఘ‌లాయిల కాలం నాటి వాతావ‌ర‌ణంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ట‌. అందులో ఒక‌టి రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర కాగా.. మ‌రొక‌టి మాత్రం చాలా స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ డ్యూయెల్ రోల్ పై క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Director Krish New Movie,Pawan Kalyan Krish Movie Hit Theatres For Sankranthi,latest telugu movies news, elugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Director Krish,Director Krish New Movie,Pawan Kalyan,Pawan Kalyan Ne
సినిమా వార్తలు

సంక్రాంతికి ప‌వ‌న్ - క్రిష్ కాంబో ఫిల్మ్?

`అజ్ఞాత‌వాసి` త‌రువాత క్రియాశీల‌క రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... ఇప్పుడు వ‌రుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప‌వ‌న్ రీ-ఎంట్రీ ఫిల్మ్ `వ‌కీల్ సాబ్` మే 15న విడుద‌ల అయ్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటోంది. మ‌రోవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ లోనూ ఈ కొణిదెల స్టార్ న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని తొలుత‌ ద‌స‌రా బ‌రిలో నిల‌పాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే, విజువ‌ల్ ఎఫెక్ట్స్ కి స్కోప్ ఉన్న సినిమా కావ‌డంతో... వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌…

Team TFNవాట్సాప్

షేర్