డైరెక్టర్ క్రిష్ సినిమాలు చూస్తే ఆయన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. సమాజంలో పరిస్థితులు ఎలా వుంటాయో వాటినే ఆయన సినిమా రూపంలో చెప్తుంటారు. ఇది ఆయన చిత్రాలు చూసే వారెవరైనా ఒప్పుకుంటారు. ఇక సోషల్ మీడియాకు ఆయన కాస్త దూరం అని చెప్పొచ్చు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక పోస్ట్ చేసినా అది కొంచం ఆలోచింపచేసేదిలా ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచనలో పడేసేలా చేస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. “చరిత్రలో వ్యక్తులలో మీరు ఎక్కువగా కలవడానికి అలాగే మాట్లాడటానికి ఇష్టపడే వ్యక్తి ఎవరు?” ఈ ప్రశ్న నన్ను నా మేనకోడలు అడిగింది.. నాకు నచ్చిన వ్యక్తి స్వామి వివేకా నందుడు.. మీకు ఎవరంటే ఇష్టమో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది అంటూ నెటిజన్స్ ను కూడా ఈ ప్రశ్న సంధించారు.
Who is the person from history that you would most like to meet and talk to?
My niece asked this and I answered – ‘Swamy Vivekananda’ and now curious to know your answers..
— Krish Jagarlamudi (@DirKrish) September 14, 2020
కాగా పవర్ స్టార్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుగగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో రకుల్ – వైష్ణవ్ తేజ్ హీరో హీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: