
ట్యాగ్ · 263 కథనాలు


గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి దిల్ రాజు కీలక సూచన

దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్

కోర్ట్ టీమ్‌ని అభినందించిన దిల్ రాజు

ఇలాంటి ఫంక్షన్ చేసుకుని చాలా కాలమైంది

ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ

గేమ్ ఛేంజర్ కు సెన్సేషనల్ బుకింగ్స్

గద్దర్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా నటి జయసుధ
తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది. ఈ జ్యూరీలో మొత్తం 15 మందితో కూడిన నిష్ణాతులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ సీనియర్ నటి జయసుధను ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఖరారుచేసింది.

గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి దిల్ రాజు కీలక సూచన
తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ - TFDC) చైర్మన్ దిల్ రాజు 'గద్దర్ అవార్డ్స్' జ్యూరీకి కీలక సూచన చేశారు. బుధవారం సంస్థ సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్, ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దిల్ రాజు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కొరకు వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరారు.

దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఓ ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. సినిమాలకు సంబంధించి ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ వర్క్స్ చేసే ఈ సంస్థతో దిల్ రాజు సంస్థ బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ వేదికగా నిన్న 'బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్' అంటూ ట్వీట్ చేసింది.

ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ డెలిగేట్స్‌తో దిల్ రాజు భేటీ
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, TSFDC చైర్మన్ దిల్ రాజు గారు ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన సోదరుడి కుమారుడు, నిర్మాత హర్షిత్ రెడ్డితో కలిసి తాజాగా హైదరాబాద్‌లోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ డెలిగేట్స్‌ను కలుసుకున్నారు. దిల్ రాజు కలిసిన ఈ బృందంలో ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు.

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఆశిష్ హీరోగా దిల్ రాజు కొత్త సినిమా, స్పెషల్ ఏంటో తెలుసా?
ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. ఈ మూవీలో 'రౌడీ బాయ్స్, లవ్ మీ' చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు.

మార్కో డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ మల్టీస్టారర్
టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మోహన్ లాల్ 'L2: ఎంపురాన్' తెలుగులో రిలీజ్ చేస్తోంది ఎవరంటే..?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

కోర్ట్ టీమ్‌ని అభినందించిన దిల్ రాజు
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఇకపై ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ - TFDC చైర్మన్ దిల్ రాజు
తెలంగాణలో ఇకపై ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ అందజేస్తామని ప్రకటించారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ మేరకు ఆయన ఈ అవార్డులకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఈరోజు సమాచార భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించనున్నామని, ఆ సినిమాలకు బెస్ట్ ఫిల్మ్ అవార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. రీరిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ మల్టీస్టారర్ మూవీ చేరింది.

సంక్రాంతికి వస్తున్నాం టీవీ &ఓటిటి లోకి ఒకేసారి
సంక్రాంతికి విడుదలై రీజినల్ మూవీస్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా ఈసినిమా 300కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈ సినిమాకు సూపర్ సపోర్ట్ లభించడంతో ఎవరు ఊహించని విజయాన్ని అందుకొని బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.

ఇలాంటి ఫంక్షన్ చేసుకుని చాలా కాలమైంది
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

బాలకృష్ణకు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు అభినందనలు
టీఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం పొందిన తర్వాత తొలిసారి బాలయ్యను కలిసిన దిల్ రాజు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించి దిల్ రాజు ఆధ్వర్యంలోని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బాలయ్యతో దిల్ రాజు కలిసిఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.

ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోంది.ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.ఈసినిమా టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో పుష్ప 2 మొదటి స్థానం లో ఉండగా ఆర్ఆర్ఆర్ , బాహుబలి 2, కల్కి 2898 ఏడి సినిమాలు తరువాతి స్థానంలో వున్నాయి.

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈసినిమాకు ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ వస్తుంది.ముఖ్యంగా రామ్ చరణ్ నటన ,తమన్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.ఇండియన్ 2 తరువాత గేమ్ ఛేంజర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడు.ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే సెకండ్ హాఫ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు.ఓవరాల్ గా ఓ మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ ను అందించాడు శంకర్.

రివ్యూ: గేమ్ ఛేంజర్
ఓవరాల్‌గా గేమ్ ఛేంజర్ సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రామ్ చరణ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఇది ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే అప్పన్న పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ మార్క్ తరహాలో కమర్షియల్ ఫార్మాట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో సాగుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

గేమ్ ఛేంజర్ కు సెన్సేషనల్ బుకింగ్స్
మచ్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.6ఏళ్ళ తరువాత రామ్ చరణ్ నుండి సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడం ట్రైలర్ రికార్డు వ్యూస్ ను రాబట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో గేమ్ ఛేంజర్ అదరగొడుతుంది.
శ్రీ తేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు, అల్లు అర్జున్
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్‌ను TFDC ఛైర్మన్ దిల్ రాజు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ మేరకు నిన్న సికింద్రాబాద్ బేగంపేట్ మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న వారు అక్కడ బాలుడిని పరామర్శించారు.