దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్

TFDC Chairman , Producer Dil Raju Gives Big Announcement

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ ఛైర్మన్‌, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఓ ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. సినిమాలకు సంబంధించి ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ వర్క్స్ చేసే ఈ సంస్థతో దిల్ రాజు సంస్థ బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ వేదికగా నిన్న ‘బోల్డ్‌… బిగ్‌… బియాండ్ ఇమాజినేష‌న్’ అంటూ ట్వీట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా దీనిపై మరో పోస్ట్ పెట్టింది. అందులో.. “దిల్ రాజు ఒక దార్శనికతతో ప్రారంభించారు. ఆయన మనకు మరపురాని కథలను అందించారు. ఇప్పుడు, ఆయన సినిమాకి అతీతంగా సరికొత్తగా నిర్మిస్తున్నారు. మా బ్లాక్‌బస్టర్ నిర్మాత దిల్ రాజు క్వాంటమ్ AI గ్లోబల్‌లోని అత్యాధునిక ఐడియాలజీ ఉన్న వ్యక్తులతో కలిసి AI-ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించారు” అని పేర్కొంది.

ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. మే 4వ తేదీన ఈ నూతన కంపెనీ పేరు సహా పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. సినిమా నిర్మాణంలో ఏఐ సాంకేతికత ద్వారా విస్తృత అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. కాగా ఈ ప్రకటన సినీ ప్రియులు మరియు ఇండస్ట్రీ నిపుణులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు, నిర్మిస్తున్నారు. మరోవైపు ఆయన వారసులు హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే మరో బ్యానర్‌ను స్థాపించి కంటెంట్ బేస్డ్ మూవీస్ నిర్మిస్తున్నారు. 100కి పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ‘బలగం’ సినిమా ఈ బ్యానర్‌పై నిర్మించినదే. అలాగే వీటితోపాటుగా చిత్ర పరిశ్రమలో కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహించేందుకు రీసెంట్‌గా ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో ఇంకో న్యూ బ్యానర్‌ను నెలకొల్పారు.

కాగా ఈ ఏడాది ఆరంభంలో దిల్ రాజు నిర్మించిన రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ పర్వాలేదనిపించినా.. విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన రీజనల్ ఫిల్మ్‌గా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్ధన’, నితిన్ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇవికాక మరికొన్ని సినిమాలు లైనప్‌లో వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.