రివ్యూ: గేమ్ ఛేంజర్

Game Changer Telugu Movie Review

నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, నాజర్, సుబ్బరాజు, సునీల్, జయరామ్, వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర తదితరులు
సంగీతం: ఎస్ థమన్
సినిమాటోగ్ర‌ఫీ: తిరు
ఎడిటింగ్: రూబెన్‌
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: ఎస్. శంకర్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన మచ్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత చరణ్ సోలో హీరోగా వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలున్నాయి. దీనికితోడు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుని సినిమాపై మార్కెట్‌లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ మూవీ.

దీంతో మెగాభిమానులు ఒకవైపు, సినీ ప్రియులు, సాధారణ ప్రేక్ష‌కులు మరోవైపు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కంప్లీట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఇంతటి భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన గేమ్ ఛేంజ‌ర్‌ ప్రేక్షకులను మెప్పించిందా?

రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అలరించాడా? సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ కథలను కమర్షియల్ టచ్‌తో అత్యద్భుతంగా తెరకెక్కించగల దర్శకుడు శంకర్ తెలుగులో తొలిసారిగా చేసిన ఈ సినిమాతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయగలిగాడా? శంకర్, చరణ్ కాంబో ఆడియెన్స్‌ను ఆకట్టుకుందా? ఇంతకూ గేమ్ ఛేంజ‌ర్‌ చిత్రం ఎలా ఉంది? అనే విషయాలు తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.

కథ:-

రామ్ నంద‌న్ (రామ్ చ‌ర‌ణ్‌) యంగ్ ఐపీఎస్ అధికారి, కోపం చాలా ఎక్కువ. కాలేజీలో పరిచయమైన దీపిక (కియారా అద్వానీ)ని ప్రేమిస్తాడు. తనకోసం కోపాన్ని తగ్గించుకుని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తన కోరిక మేరకు ఐఏఎస్ అవుతాడు. ఈ క్రమంలో విశాఖ‌ జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా వ‌స్తాడు. అదే సమయంలో ఏపీలో అభ్యుద‌య అనే పార్టీ అధికారంలో ఉంటుంది.

ముఖ్య‌మంత్రి స‌త్య‌మూర్తి (శ్రీ‌కాంత్) చేతిలో మ‌రో యేడాది అధికారం ఉంటుంది. ఈ యేడాది అవినీతిని ప‌క్క‌న పెట్టి, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని మంత్రుల్ని, ఎం.ఎల్.ఏల‌ను ఆదేశిస్తాడు. అయితే స‌త్య‌మూర్తి త‌న‌యుడు మోపీదేవి (ఎస్‌.జె.సూర్య‌)కి సీఎం సీటుపై కన్ను వుంటుంది. తండ్రి ఎప్పుడు పోతాడా.. ఎప్పుడెప్పుడు సీఎం అవుదామా అని వేచి చూస్తుంటాడు.

ఈ నేపథ్యంలో మోపిదేవి అక్రమాలకు క‌లెక్ట‌ర్ రామ్ నంద‌న్ అడ్డుకుని చెక్ పెడతాడు. మరోవైపు స‌త్య‌మూర్తి చ‌నిపోతాడు. ఆయన స్థానంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా పార్టీ పెద్ద‌లు మోపీదేవిని బ‌ల‌ప‌రుస్తారు. ఇక మోపీదేవినే సీఎం అని అంతా అనుకుంటున్న త‌రుణంలో క‌థ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. రామ్ నంద‌న్‌కు సంబంధించిన ఓ నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.

అసలు రామ్ నందన్ ఎవరు? అభ్యుదయ పార్టీకి, అప్పన్న, పార్వతి లకు.. రామ్ నందన్‌కు ఉన్న సంబంధం ఏంటి? త‌న‌కూ స‌త్య‌మూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? సీఎం పదవి దక్కించుకోవడానికి మోపిదేవి ఎలాంటి ఎత్తులు వేశాడు? తన అధికార బలాన్ని ఉపయోగించి రామ్ నందన్‌ను ఎలా అడ్డుకున్నాడు? అతడి ప్రయత్నాలను రామ్ నందన్ ఎలా చెక్ పెట్టాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:-

డైరెక్టర్ శంకర్ ఇంతకుముందు తీసిన సినిమాల మాదిరే గేమ్ ఛేంజర్ కూడా అవినీతి, కుటిల రాజకీయాలు, సోషల్ మెసేజ్ ఇలా ఈ ఫార్మాట్‌లో సాగుతుంది. ఒకే ఒక్కడు సినిమా లోని ఒక్క రోజు సీఎంను గుర్తు చేస్తూ మొదలవుతుంది. ఐఏఎస్‌గా బాధ్యతలు తీసుకున్న రామ్ నందన్ అవినీతిపరుల భరతం పడుతుండటం, ఈ క్రమంలో మంత్రి మోపిదేవి అక్రమాలను అడ్డుకోవడం, ఇద్దరి మధ్య పోరుతో తొలిభాగం ఉత్కంఠగా సాగుతుంది.

ఈ నేపథ్యంలో రాజకీయ బలానికి, అధికార బలానికి మధ్య తలెత్తే సంఘర్షణతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఇక సెకండాఫ్ లో అప్పన్న (రామ్ చరణ్) పాత్ర పరిచయం, ఫ్యామిలీ నేపథ్యం, రాజకీయాలు ఇలా సీరియస్ కథనంతో పరుగెడుతుంది సినిమా. ఇక ఎప్పుడైతే రామ్ నందన్ ఎవరో తెలిసిపోయాక స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా నిజంగానే అన్ ప్రెడిక్టబుల్ గా ముగించాడు దర్శకుడు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. రామ్ చరణ్ ఎలాంటి నటుడో ప్రత్యేకించి చెప్పనక్కలేదు. మగధీర, రంగస్థలం, ధ్రువ వంటి సినిమాలలో తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో డ్యూయెల్ రోల్స్‌లో కనిపించిన చరణ్ రెండింటినీ అత్యద్భుతంగా పోషించాడు. నిజాయితీ కలిగిన యువ ఐఏఎస్ ఆఫీసర్‌గా మరియు ఉన్నత విలువలు కలిగిన రాజకీయనాయకుడిగా దేనికదే అన్నట్టుగా నటించాడు. ఈ రెండు పాత్రల కోసం ఆయన పడిన కష్టం, చూపిన డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. ముఖ్యంగా అప్పన్న క్యారక్టర్‌లో రామ్ చరణ్ ఇప్పటివరకూ చేయని పాత్రలో నటించి మెప్పించాడు.

ఇక హీరోయిన్ కియారా అద్వానీ తెరపై అందంగా కనిపించింది. శంకర్ మార్క్ తరహా పాటలు ఆమెను ఇంకా అందంగా ప్రజెంట్ చేశాయి. అలాగే మరో కథానాయికగా నటించిన అంజలి కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రను చేసింది. ఒకరకంగా లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్ పోషించిందని చెప్పొచ్చు. ఈ మూవీలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో అంజలి నటనకు మంచి మార్కులు పడతాయి. చరణ్ సరసన ఈ ఇద్దరు హీరోయిన్స్ చక్కగా ఒదిగిపోయారు.

ఇతర నటులలో ఎస్.జె. సూర్య అద్భుతంగా నటించాడు. మంత్రి మోపిదేవి పాత్రలో మరోసారి తన మార్క్ నటనను ప్రదర్శించాడు. ఈ క్యారక్టర్ ఆయన తప్ప మరెవ్వరూ వేయలేరు అనేంతగా నటించాడు. అలాగే శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, నాజర్, సుబ్బరాజు, సునీల్, జయరామ్, వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

ఇక సినిమా టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్ లో ఉంది. థమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. మాములుగా శంకర్ సినిమాలంటే ఏఆర్ రెహమాన్ తప్పనిసరి. అలాంటిది ఈ చిత్రానికి థమన్ పనిచేయడం విశేషమైతే, తనకు అందిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. సాంగ్స్ అన్నీ చాలా బావున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూజ్ బంప్స్ తెప్పించేలావుంది. చాలా సీన్స్ కేవలం బీజీఎమ్ వల్ల హైలైట్ అయ్యాయి.

ఇక తిరు సినిమాటోగ్ర‌ఫీ గ్రాండియర్‌గా ఉంది. డైరెక్టర్ శంకర్ విజన్‌ని బిగ్ స్క్రీన్‌పై ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా అనిపిస్తుంది. విజువల్స్, లొకేషన్స్ అందంగా ఉన్నాయి. అలాగే ఎడిటింగ్ విషయానికొస్తే, కోలీవుడ్ లో పలు హిట్ సినిమాలకు పనిచేసిన రూబెన్ ఈ చిత్రంతో తన ట్యాలెంట్ ఏంటో చూపించాడు. నిడివి ఎక్కువ ఉన్నాకూడా మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉందంటే అందుకు ఆయన ఎడిటింగే కారణం. చాలా షార్ప్‌గా ఉండి సినిమాపై ఆసక్తిని కోల్పోకుండా చేసింది.

అలాగే ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. శంకర్‌తో మూవీ అంటే ఆషామాషీ కాదు. ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా సినిమా రావాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిఉంటుంది. దీనికితోడు దాదాపు మూడేళ్ళ పాటు ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. కేవలం పాటలకే రూ.75 కోట్లు ఖర్చు అయ్యాయంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమాను ఏ స్థాయిలో నిర్మించారో. దిల్ రాజు కాబట్టే ఈ చిత్రాన్ని ఇంత రిచ్‌గా నిర్మించారని చెప్పొచ్చు. ఖర్చుకి ఆయన ఎక్కడా వెనుకాడలేదని తెలుస్తుంది.

ఓవరాల్‌గా గేమ్ ఛేంజర్ సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రామ్ చరణ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఇది ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే అప్పన్న పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ మార్క్ తరహాలో కమర్షియల్ ఫార్మాట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో సాగుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.