టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, TSFDC చైర్మన్ దిల్ రాజు గారు ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన సోదరుడి కుమారుడు, నిర్మాత హర్షిత్ రెడ్డితో కలిసి తాజాగా హైదరాబాద్‌లోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ డెలిగేట్స్‌ను కలుసుకున్నారు. దిల్ రాజు కలిసిన ఈ బృందంలో ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య, ప్రత్యేకించి సినిమా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత పటిష్టం ఎలా చేసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల మధ్య సినిమా సహ నిర్మాణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల మార్పిడి వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు.
ముఖ్యంగా, హైదరాబాద్ నగరంపైనా, తెలుగు సినిమాపైనా ఆస్ట్రేలియా ప్రతినిధులు ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపించారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సృజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడుతుందని, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: