నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందురోజు వేసిన స్పెషల్ ప్రీమియర్స్ తోనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఇలాంటి సినిమాతో చాలా మంచి ప్రయత్నం చేశారంటూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కోర్ట్ ఘన విజయం సాధించినందుకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు దిల్ రాజు మరియు శిరీష్ హీరో నాని మరియు టీం కోర్ట్‌ను అభినందించారు. ఈ మేరకు వారు తాజాగా చిత్రబృందాన్ని కలిసి ప్రశంసించారు. ఈ సందర్భంగా “మా నిర్మాతలు దిల్ రాజు గారు మరియు శిరీష్ గారు నిర్మాత నాని మరియు కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ బృందాన్ని కలిసి సినిమా బ్లాక్ బస్టర్ విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మా ప్రియమైన నాని మద్దతుతో ఈ అద్భుతమైన చిత్రం నైజాం పంపిణీలో భాగమైనందుకు మేము చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉన్నాము” అని ఎక్స్ వేదికగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: