టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ మల్టీస్టారర్ మూవీ చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం రీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ శుక్రవారం (మార్చి 7)న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాత దిల్ రాజు నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రాలో రిలీజ్ చేసే ఏరియాల్లో 70% వరకు బుకింగ్స్ అయ్యాయని, రిలీజ్ నాటికి 100% అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియటర్‌లో శుక్రవారమే కాకుండా శనివారం కూడా 4 షోస్ నిర్వహించనున్నామని దిల్ రాజు తెలిపారు. 7వ తేదీ ఉదయం ఆటకు తాను స్వయంగా వెళ్లి చూస్తానని చెప్పారు. ఆ విధంగా 12 ఎళ్ల తర్వాత ఈ సినిమాను థియేటర్ లో చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించాలని దిల్ రాజు కోరారు.
కాగా 2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం నమోదుచేసింది. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వెంకటేష్, మహేష్ బాబు, హీరోలుగా నటించగా.. వారి సరసన అంజలి మరియు సమంత కథానాయికలుగా కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, కోట శ్రీనివాసరావు, అభినయ మరియు రోహిణి హట్టంగడి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
అయితే తెలుగులో ఇలా అసలైన మల్టీస్టారర్ సినిమా వచ్చి అప్పటికి చాలా ఏళ్ళు కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఒకే స్క్రీన్‌పై ఇద్దరు స్టార్ హీరోలను చూడటం వారికి థ్రిల్‌ను పంచింది. తమ అభిమాన హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసుకుని మురిసిపోయారు. దీనికి తోడు కథ ప్రకారం, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకులుగా నటించడం, ప్రత్యేకించి వెంకీ, మహేష్ ఇద్దరూ సోదరులుగా కనిపించడం ఆడియెన్స్‌ను కట్టిపడేసింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా సంగీతపరంగానూ ఆకట్టుకుంది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీకి పనిచేయడం విశేషం. మిక్కీ జె. మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అనిపించుకున్నాయి. అలాగే స్వరబ్రహ్మ మణి శర్మ సమకూర్చిన నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: