గద్దర్‌ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా నటి జయసుధ

Actress Jayasudha Appointed as Jury Chairperson For Gaddar Telangana Film Awards

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది. ఈ జ్యూరీలో మొత్తం 15 మందితో కూడిన నిష్ణాతులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ సీనియర్ నటి జయసుధను ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఖరారుచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థ సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్, ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ ఫిల్మ్ అవార్డ్స్ కొరకు వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు కీలక సూచన చేశారు. ఆయన సూచనపై జ్యూరీ ఛైర్మన్‌ జయసుధ స్పందిస్తూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు.

ఇక ఈ సందర్భంగా గద్దర్ అవార్డుల కోసం వివిధ క్యాటగిరీలలో ఎంట్రీలకు వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి జ్యూరీ సభ్యులు చర్చించారు. ఈ అవార్డ్స్‌కి అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందినట్టు వెల్లడించారు. వీటిలో వ్యక్తిగత క్యాటగిరీలో 1172, ఫీచర్‌ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు వంటి వివిధ క్యాటగిరీలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యూరీ తెలిపింది. కాగా ఈ నెల 21 వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగనున్నట్టు జ్యూరీ ప్రకటించింది.

‘గద్దర్‌ అవార్డ్స్’ జ్యూరీ సభ్యులు వీరే..!

  • నటి జయసుధ – ఛైర్మన్‌
  • నటి జీవిత రాజశేఖర్ – మెంబర్
  • డైరెక్టర్ దశరథ్ – మెంబర్
  • డైరెక్టర్ BV నందినీ రెడ్డి – మెంబర్
  • ఎక్సిబిటర్ E. విజయ్ కుమార్ రావు – మెంబర్
  • జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ – మెంబర్
  • డైరెక్టర్ డా. L. శ్రీనాథ్ – మెంబర్
  • ఫిల్మ్ అనలిస్ట్ డా. ఆకునూర్ గౌతమ్ – మెంబర్
  • గేయరచయిత కాసర్ల శ్యామ్ – మెంబర్
  • డైరెక్టర్ C. ఉమామహేశ్వరరావు – మెంబర్
  • డైరెక్టర్ శివ నాగేశ్వరరావు – మెంబర్
  • డైరెక్టర్ VN ఆదిత్య – మెంబర్
  • జర్నలిస్ట్ G. వెంకట రమణ – మెంబర్
  • ప్రొడ్యూసర్ ఏడిద రాజా – మెంబర్
  • TGFDC MD డా. S. హరీష్ – మెంబర్ కన్వీనర్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.