నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందురోజు వేసిన స్పెషల్ ప్రీమియర్స్ తోనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో దాదాపు 55కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తెలుగులో ఇలాంటి సినిమాతో చాలా మంచి ప్రయత్నం చేశారంటూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కోర్ట్ ఘన విజయం సాధించినందుకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు దిల్ రాజు మరియు శిరీష్ హీరో నాని మరియు టీం కోర్ట్‌ను అభినందించారు. ఈ మేరకు వారు తాజాగా చిత్రబృందాన్ని కలిసి ప్రశంసించారు. కేక్ కట్ చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా “సెలెబ్రేటింగ్ సక్సెస్! కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనే అద్భుతమైన విజయానికి హర్షధ్వానాలు మరియు ప్రశంసలతో నిండిన ప్రత్యేక సాయంత్రం. మొత్తం బృందానికి అభినందనలు!” అని ఎక్స్ వేదికగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























