ఆశిష్ హీరోగా దిల్ రాజు కొత్త సినిమా, స్పెషల్ ఏంటో తెలుసా?

Dil Raju’s Sri Venkateswara Creations Announces Landmark 60th Film With Ashish Reddy

ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. ఈ మూవీలో ‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సెట్ చేయబడింది, ఆశిష్ లోకల్ బాయ్‌గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యం కథకు రగ్గడ్ అండ్ గ్రిట్టీ ఎట్మాస్పియర్‌తో ఇంటెన్స్‌ని యాడ్ చేస్తోంది. ఇప్పటికే తన మునుపటి పాత్రలలో వెర్సటాలిటీని ప్రజెంట్ చేసిన ఆశిష్, ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ కానున్నారు. మరింత ఇంటెన్స్, మాస్-ఓరియెంటెడ్ లుక్‌లో కనిపించబోతున్నారు.

డెబ్యు డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని ఈ సినిమా కోసం హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన కథని రెడీ చేశారు. ఎక్సైట్‌మెంట్‌ని మరింత పెంచుతూ, నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని ఫ్లూయంట్‌గా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేశారు. ఈ నటీనటుల ఎంపిక అన్ని వయసుల నటులకు ఓపెన్‌గా వుంటుంది.

ఇది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి గొప్ప అవకాశం అందిస్తుంది. అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ గల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరోసారి హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ గల చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.