
ట్యాగ్ · 590 కథనాలు · పేజీ 5


ప్రధాని మోదీ.. నాతో ఏం చెప్పారంటే? - మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై

మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం

ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరంజీవి ?

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం

ఆగష్ట్ లో సినిమా రిలీజ్ ల సందడి

విశ్వంభర.. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ప్రధాని మోదీ.. నాతో ఏం చెప్పారంటే? - మెగాస్టార్
మెగా బ్రదర్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతి.. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న విషయం. నేషనల్ మీడియాలో సైతం ఈ వార్తకు అధిక ప్రాధాన్యం లభించిందంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత సెన్సేషన్ అయిందో. ఈ అపూర్వ సన్నివేశానికి వేదికైంది మాత్రం ఆంధ్రప్రదేశ్. బుధవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

ఒకే వేదికపై రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్
ఇండియాలో సినిమా హీరోలు అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. అదే దక్షిణాదిలో అయితే ఇక చెప్పనే అక్కరలేదు. స్టార్‌డమ్ ఉన్న ప్రతి నటుడికి లక్షల్లో అభిమానులు ఉంటారు. ఇక ఎప్పుడైనా ఏదయినా సందర్భంలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకేచోట కనిపిస్తే వారి అభిమానులకు పండుగే. అలాంటిది ఒకే వేదికపై ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అగ్ర తారలు కనిపిస్తే ఊహించుకోవడానికే వాహ్ అనిపిస్తుంది కదా.! అదే నిజమైతే ఆయా హీరోల ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. ఇలాంటి సందర్భమే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు శుక్రవారం చిరంజీవి మరియు ఆయన సతీమణి సురేఖ దంపతులు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై వారికి సాదరంగా ఆహ్వానం పలుకగా.. చిరంజీవి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం గవర్నర్ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో చిరంజీవికి భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' అవార్డు లభించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

మెగాస్టార్ చిరంజీవికి శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మెగాస్టార్ చిరంజీవిని సత్కరించింది.

ట్రెండింగ్‌లో.. విశ్వంభర గ్లింప్స్ అండ్ కాన్సెప్ట్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రానికి 'విశ్వంభర'గా టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'బింబిసార'తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిన్న చిత్ర యూనిట్ 'విశ్వంభర' టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కూడిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని అమాంతంగా పెంచేయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ఈ పాటకు రోషన్‌తో కలిసి స్టెప్స్ వేయాలనిపించింది - మెగాస్టార్ చిరంజీవి
సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. 'క్షణం', 'కృష్ణ అండ్ లీల' చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు. మానస చౌదరి కథానాయికగా నటించగా.. హర్ష, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, అను హాసన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఒక కొత్త చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. " ‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమాటిక్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం" అని వశిష్ట పేర్కొన్నారు. ఈ సందర్భంగా వశిష్ట ‘మెగా 157’ టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్ చే శారు. కాగా ఈ సినిమా సోషియో ఫాంటసీగా రూపొందనుంది.

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. నేటితో ఆయన 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ పడిలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పవన్‌తో కలిసి తాము దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా తన తమ్ముడు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరంజీవి ?
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.2019 సెప్టెంబర్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ సృష్టించింది.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కొన్ని నెలలపాటు ట్రెండింగ్ లో కొనసాగింది.మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ కావడంతో రెండో సీజన్ కూడా వచ్చింది.ఈసీజన్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది.ఈసిరీస్ ను రాజ్ &డీకే డైరెక్ట్ చేయగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్ లో నటించాడు.

చంద్రయాన్ 3 సక్సెస్‌పై స్పందించిన టాలీవుడ్ సెలెబ్రిటీలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన 'చంద్రయాన్ 3' మిషన్ సూపర్ సక్సెస్ అయింది. తద్వారా రోదసిలో ఇప్పటివరకు మరే దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'ఇస్రో' విక్రమ్ ల్యాండర్‌ను దించింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి తొలి చంద్రుడి తొలి ఫోటోను పంపించింది. కాగా ఇప్పటివరకూ చంద్రునిపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపాయి.

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలో శంకర్ దాదా MBBS రీ రిలీజ్
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోల పుట్టిన రోజు సందర్భంగా ఒకప్పటి హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'పోకిరి' నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని ఇతర టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్‌లతో ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజై భారీ కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే విచిత్రంగా గతంలో అంతగా విజయం సాధించని సినిమాలు కూడా రీ రిలీజ్‌లో నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'యోగి' సినిమాను రీసెంట్‌గా రీ రిలీజ్ చేయగా.. విడుదలైనప్పటికంటే ఇప్పుడే ఎక్కువ…

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నేడు కీలక ప్రకటన చేసింది. చిరంజీవితో కొత్త సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో వారికి మెగా బర్త్ డే గిఫ్టును అందించినట్లయింది.

అన్నయ్య చిరంజీవికి 'బర్త్ డే' విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలోని అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. 1978లో 'పునాదిరాళ్లు' అనే తెలుగు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన నేటికీ అగ్ర హీరోగా కొనసాగుతుండటం గమనార్హం. కాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. నేటితో ఆయన 68వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి.. జనసేన పార్టీ అధినేత, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 'బర్త్ డే' విషెస్ తెలియజేశారు. ఈ మేరకు అన్నయ్య చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ ఒక లేఖను విడుదల…

భోళాశంకర్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈసినిమాను ఖచ్చితంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. కేవలం ఒక వర్గానికి మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

'భోళా శంకర్' మేనియా.. హైదరాబాద్‌లో చిత్ర బృందం భారీ ర్యాలీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రేపు (ఆగస్టు 11, 2023) ప్రపంచవ్యాపంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో వేలాది మెగా అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ వీధుల్లో మొత్తం 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం జీపీఎస్ ట్రాకింగ్‌లో మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీ చేపట్టడం విశేషం. అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరో ఇలా జరుపుకోలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్…

వాల్తేరు వీరయ్య 200 రోజులు వేడుక- చరిత్రని తిరగరాసినట్లు ఉంది
బాబీ డైరెక్షన్ లో మెగస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. చిరంజీవి డ్యాన్సులు, నటన వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసి ప్రేక్షకులను ఆకట్టున్నాయి. చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ని విపరీతంగా అలరించాయి. ఇక ఈసినిమా థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది.

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమాను కూడా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

భోళాశంకర్ నుండి రేజ్ ఆఫ్ భోళా రిలీజ్
వాల్తేరు వీరయ్య తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.సాంగ్స్,ట్రైలర్ తో సూపర్ హైప్ తెచ్చుకున్న ఈసినిమా మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా నుండి తాజాగా రేజ్ ఆఫ్ భోళా అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.ఫాస్ట్ బీట్ తో వచ్చిన ఈసాంగ్ ఆకట్టుకుంది.డైరెక్టర్ మెహర్ రమేష్,ఫిరోజ్ ఇజ్రాయెల్ లిరిక్స్ అందించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

ఆగష్ట్ లో సినిమా రిలీజ్ ల సందడి
సినీ లవర్స్ కు ప్రతి శుక్రవారం పండగ లాంటిదే. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. సీజన్ అయితే ఒక్కోసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సమ్మర్ లో పలు సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వగా.. జూన్, జులై లో ఆ జోరు కాస్త తగ్గింది. ఇక ఇప్పుడు ఆగష్ట్ నెల మాత్రం మంత్ మొదలు నుండి చివరి వరకూ వరుస రిలీజ్ లతో సందడి కానుంది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకూ ఈ ఒక్క నెలలోనే చాలాా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.