మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మెగాస్టార్ చిరంజీవిని సత్కరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ (శివన్న) చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఇంటికి విచ్చేశారు. మెగాస్టార్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చిన శివన్న.. భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్న ఇరువురూ కొద్దిసేపు సినిమాలు సహా ఇతర విషయాల గురించి చర్చించుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి భోజనం చేశారు. వీరికి మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత దగ్గరుండి భోజనం వడ్డించారు. అనంతరం ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో.. “”నన్ను అభినందించేందుకు నా మిత్రుడు శివ రాజ్‌కుమార్ బెంగళూరు నుంచి రావడం నా మనసుని హత్తుకుంది. తనతో కలిసి సమయం గడపడం, కలిసి భోజనం చేయడం, రాజ్‌కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అని పేర్కొన్నారు.
Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗
Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: