కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bigg Boss 4 Telugu

ట్యాగ్ · 56 కథనాలు · పేజీ 3

బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - కెప్టెన్ గా అరియనా హౌస్ నుండి బయటికి వెళ్లిన నోయెల్

బిగ్ బాస్ 4 - నిన్న ఎపిసోడ్ స్టార్టింగే నోయల్ అనారోగ్యంతో బాధపడటం చూపించారు. అర్ధ‌రాత్రి దాటినా అనారోగ్యం కారణంగా నిద్ర పట్టకపోవడంతో కాస్త కన్నీరు పెట్టుకున్నాడు. ఇక పొద్దున్నే లేచిన తర్వాత అభి, నోయ‌ల్, హారిక ఒక దగ్గర కూర్చొని వుంటారు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న మోనాల్ ను చూసి మోనాల్ ఒంటెలా న‌డుస్తుంద‌ని అడగగా.. మ‌రి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావ‌ని నోయ‌ల్ అభికి కౌంటర్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4- అభి, మోనాల్ కు రాయబారిగా అఖిల్

బిగ్ బాస్ 4 - అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నారు హౌస్ మేట్స్. ఇక నిన్న 51వ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ నామినేషన్స్ తర్వాత హౌస్ మేట్స్ ఇంకా దాని గురించే చర్చించుకుంటున్నారు. అభిజిత్‌తో మోనాల్ మధ్య ఉన్న గ్యాప్ ను క్లియర్ చేసుకోమని అఖిల్ మోనాల్ కు చెపుతాడు. దానికి నేను ఇంకా అలిసిపోయా అని చెప్పడంతో పోనీ నేను మాట్లాడ‌నా అని అనుమ‌తి తీసుకుని అభిజిత్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. ఒక‌సారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వ‌స్తుంద‌ని అఖిల్ సూచించ‌డంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడ‌దామన్నాడు. మరోపక్క అమ్మ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ అదే నామినేషన్స్ గురించి చర్చ. తనను సోహెల్ నామినేట్ చేయడంతో అమ్మ రాజశేఖర్…

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్4 - మామ ప్లేస్ లో కోడలు

బిగ్ బాస్4- వీక్ డేస్ లో ఎలా ఉన్నా వీకెండ్ లో మాత్రం బిగ్ బాస్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. హోస్ట్ గా నాగార్జున రావడం వాళ్లకు క్లాసులు పీకడం.. గొడవలు ఏమన్నా ఉంటే వాటిని సార్ట్ అవుట్ చేయడం.. గేమ్స్ లాంటివి ఆడిస్తుంటారు... దీనితో వీకెండ్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఇక ఈ రోజు హోస్ట్ గా నాగ్ వస్తాడా..? లేదా..? నాగ్ ప్లేస్ లో ఇంకెవరైనా వస్తారా..? అన్న ప్రశ్నలు నిన్నటి నుండి వస్తూనే ఉన్నాయి. ఇక ఈరోజు నాగ్ ప్లేస్ లో సమంత వస్తుందన్న వార్తులు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు బ్రేక్ పడింది. హోస్ట్ ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. స్టార్ మా యాజమాన్యం తమ ట్విట్టర్ ద్వారా రేపు స్పెషల్…

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా

బిగ్ బాస్ 4 - నిన్నటి ఎపిసోడ్ పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు చిన్న టాస్క్ ఇచ్చాడు. ఒక మ్యాట్రెస్ ఇచ్చి దానిపై చివరికి ఎవరు మిగులుతారో వారు ఒక‌రోజు ఓ గంట ఎక్కువ సేపు ప‌డుకునే అవ‌కాశం క‌ల్పించాడు. ఇక ఈ ఛాన్స్ కోసం అందరూ పోటీ పడ్డారు. ఒకరిని ఒకరు లాక్కున్నారు. కింద పాడేసుకున్నారు. కానీ ఫైనల్ గా దివి విజ‌యం సాధించింది. దీంతో నేడు ఆమె ఆ బెడ్‌పై ప‌డుకునే ఛాన్స్ కొట్టేయ‌డంతో పాటు ఓ గంట ఆల‌స్యంగా లేచే అవ‌కాశాన్ని పొందింది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 7 వారం కెప్టెన్ గా 'అవినాష్'

బిగ్ బాస్ 4 - లగ్జరీ టాస్క్ ముగిసి అందులో బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్లుగా అవినాష్ - అరియనాను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ ముగిసేసరికి హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. అరియనా-అవినాష్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ 'నువ్వు కెప్టెన్ అయితే నేను అసిస్టెంట్ కెప్టెన్' అని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె మాత్రం "ఒక‌వేళ నేను గెలిస్తే అమ్మ‌తోడు నీకు చుక్క‌లు చూపిస్తా"న‌ని ఇద్దరూ టీజ్ చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4- కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు

బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు' కొనసాగింపే. ఇప్పటికే మంచి మనుషులకు బిగ్ బాస్ రెండు టాస్క్ లు బంతి పూలతో 50 దండలు చేయడం.. వంద ప్రమిదలు చేయమని చెప్పగా ఆరెండు టాస్కుల్లో మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఇక నిన్నటి ఎపిసోడ్ అలా ప్రారంభమయ్యిందో లేదో వెంటనే రాక్షసుల టీమ్ హౌస్ మేట్స్ పై తమ ప్రతాపం చూపించారు. బెడ్ల‌ను చింద‌ర‌వంద‌ర చేస్తూ.. బట్టలను విసిరేస్తూ.. షూస్ ను విసిరేస్తూ నానా భీభత్సం చేశారు.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4- బీభత్సం చేసిన రాక్షసులు

బిగ్ బాస్ 4 - 7వ వారంలో ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్కు ఇచ్చేసాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా "కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు" అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్ లో బిగ్‌బాస్‌పురం రాజ్యంలో అరియానా, అవినాష్‌, అఖిల్‌, మెహ‌బూబ్, హారిక‌ కొంటె రాక్ష‌సుల టీమ్‌లో ఉండ‌గా, నోయల్, అభిజిత్, లాస్య, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, సోహెల్ మంచి మనుషులు టీమ్ లో ఉన్నారు. ఇక టాస్క్ లో ఒక్కో రాక్ష‌సుడిని మంచి మ‌నిషిగా మార్చిన ప్ర‌తీసారి రావ‌ణుడి బొమ్మ‌లోని ప‌ది త‌ల‌ల్లో రెండింటిని ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. అందుకు బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తాడు. టాస్క్ ను పూర్తి చేసిన ప్రతిసారీ రెండు తలలను పగల గొట్టాలి. అలా ముగ్గురు రాక్ష‌సులను‌…

TFN Adminవాట్సాప్
Noel Sean Becomes Captain For Second Time In Bigg Boss 4 Show
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - రెండోసారి కెప్టెన్ అయిన నోయ‌ల్‌

బిగ్ బాస్ 4.. మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్నటి కంటే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకా కష్టమైన టాస్క్ లు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఏడో డీల్‌ గా త‌ల‌, గ‌డ్డం స‌గం గీసుకోవాలి. అయితే ఈ టాస్క్ మాత్రం రెండు టీమ్స్ చేయమని చెప్పేసరికి బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఎనిమిదో డీల్‌ గా పేడ క‌లిగిన బాత్‌ట‌బ్‌లో దిగాలి. అఖిల్ గంట మోగించ‌డంతో అత‌ని టీమ్‌లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వ‌చ్చింది. తొమ్మిదో డీల్‌ గా ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అర‌టి ప‌ళ్ల‌ను తినాలి. అరియానా గంట మోగించ‌డంతో అభిజిత్‌ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు…

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్‌బాస్ 4 - 'అమీ తుమీ' తేల్చుకుంటున్న హౌస్ మేట్స్

బిగ్ బాస్4- బిగ్ బాస్ 6వ వారంలో అప్పుడే రెండో రోజులు పూర్తయింది. ఇక ముందు మార్నింగ్ మస్తీలో భాగంగా సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో అమ్మ రాజశేఖర్ వంట వండుతూ... అత‌డిని చ‌పాతీలా రుబ్బుతూ.. ఆడుకున్నారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజ‌శేఖ‌ర్ అత‌డిపై విశ్రాంతి తీసుకుంటూ ప‌డుకున్నాడు. అఖిల్ వాష్‌రూమ్‌గా మారిపోగా అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ చేసి న‌వ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అంద‌రూ మ‌రోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుప‌డ్డారు. దివి కాసేపు డ‌స్ట్‌బిన్‌లా చేసింది. మ‌రోవైపు అభిజిత్ సోహైల్‌కు అంద‌రూ ఇచ్చే స‌ల‌హానే మ‌ళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం…

TFN Adminవాట్సాప్
Bigg Boss 4 Show To Bring Out The Contestants Elimination List For The 6th Week
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 6వ వారం నామినేషన్ లిస్ట్

బిగ్ బాస్ సీజ‌న్ 4 - ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సుజాత వెళ్ళిపోతూ బిగ్ బాంబు వేయడంతో ఈ వారం మొత్తం సోహైల్ గిన్నెలు తోమాల్సి వచ్చింది. బిగ్ బాంబ్ లో భాగంగా సోమ‌వారం రోజు ఎపిసోడ్ సోహైల్ గిన్నెలు క‌డుగుతుండ‌డాన్ని చూపించారు. అయితే ప‌ర్స‌న‌ల్ క‌ప్పులు కూడా క‌డ‌గ‌కుండా అక్కడే పెట్టి వెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండటంతో అమ్మ రాజశేఖర్ కలుగ చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. అయినా వినకపోవడంతో అక్కడ పెట్టెయ్ నేనే కడుగుతా అని అమ్మ రాజశేఖర్ చెప్పడంతో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త వాదన జరిగింది.

TFN Adminవాట్సాప్
Akkineni Nagarjuna Promises To Construct House For Bigg Boss Contestant Gangavva
బిగ్ బాస్

బిగ్ బాస్ 4- 'గంగవ్వ' ఇంటి కల నెరవేరుస్తానన్న నాగ్

బిగ్ బాస్ 4- ఈ వారం మొత్తం 9మంది నామినేషన్ లో ఉండగా.. ఇద్దరు హౌస్ మేట్స్ ఇంటి నుండి బయటకు వచ్చారు. అయితే సుజాత నామినేషన్ లో ఉండి బయటకు రాగా.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గంగవ్వ మాత్రం అనారోగ్యం కారణంగా బయటకు రావాల్సి వచ్చింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే గంగవ్వ కాస్త డీలా పడిపోయి బయటకు వెళ్తా అని కన్నీరు పెట్టింది. అయితే అప్పుడు బిగ్ బాస్ సర్ది చెప్పడంతో ఎలాగొలా 4 వారలు నెట్టుకొచ్చేసింది. అయితే ఇప్పుడు అక్కడ వాతావరణానికి ఉండలేక కాస్త అనారోగ్యానికి గురవ్వడంతో.. ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని డాక్టర్లు రిపోర్టు ఇవ్వడంతో.. బిగ్‌బాస్‌ పర్మిషన్ తీసుకున్న నాగార్జున, గంగవ్వను…

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

'బిగ్ బాస్ 4' లో లేను.. ఫ్యూచర్ లో కూడా ఉండను

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. పలానా సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారంటూ కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. హీరో కార్తికేయ, తరుణ్ లతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికే ఆవార్తలపై స్పందించి తాము బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయట్లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. మొన్నటికి మొన్న సినీనటి కల్పిక గణేశ్ కూడా…

TFN Adminవాట్సాప్
Actor Nandu Quizzes Audience With A Fun Video On Social Media
సినిమా వార్తలు

'BB' అంటే అది కాదు - కన్ఫ్యూజ్ చేస్తున్న నందు

బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 త్వరలోనే ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంతో ప‌క‌డ్భందీగా బిగ్ బాస్4 షోను నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు నిర్వాహ‌కులు. ఇప్పటికే ఓ ప్రోమోను రిలీజ్ చేసింది కూడా స్టార్ మా. కాగా బిగ్ బాస్‌-4 షోలో మొత్తం 16 మంది పాల్గొన‌బోతుండ‌గా మ‌రోసారి హోస్ట్‌గా నాగార్జున‌ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. యాథావిధిగా 106 రోజుల పాటు ఈ షో జ‌ర‌గ‌నున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 లో ఎంట్రీ..?

‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది లాస్య. తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే మంజునాథ్ ను వివాహం చేసుకుంది లాస్య. వారికి ఒక బాబు కూడా వున్నాడు. ప్రస్తుతం భర్త, బిడ్డతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. అయితే వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు. అయితే తన యూ ట్యూబ్ ఛానల్ తో పలు వంటకాలు, టిప్స్ చెపుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే మళ్ళీ తెరపై కొన్ని షోస్‌లో అక్కడక్కడా కనిపిస్తోంది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ రూమర్స్ పై క్లారిటీ - నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు..!

త్వరలో బిగ్ బాస్ సీజన్4 మొదలు కానున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఎప్పుడైతే షో మొదలైందో అప్పటినుండి పలువురు హీరోల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో కార్తికేయ తాను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మరో హీరోకూడా తనపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు తరుణ్. తరుణ్ సీజన్ 4లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ చాలా రోజులనుండే వార్తలు అందుకున్నాయి.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

'బిగ్ బాస్' పై వస్తున్న వార్తలన్నీ రూమర్సే..!

తెలుగులో కూడా బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్ లు రాగా మూడు సీజన్ లు మంచి నాలుగో సీజన్ కు సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్ప‌టికే సెల‌బ్రెటీల ఫైన‌ల్ లిస్టు కూడా త‌యారైనట్టు.. 12 మందితోనే కేవలం 50 రోజుల నిడివితో ఈ షో.. న‌డిపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ కోసం పలువురిని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు కార్తికేయ పేరు తెరపైకి వచ్చింది. కార్తికేయ బిగ్ బాస్ లో నటిస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్