బిగ్ బాస్4 – మామ ప్లేస్ లో కోడలు

Actress Samantha Akkineni To Replace Nagarjuna In Bigg Boss 4 Show

బిగ్ బాస్4- వీక్ డేస్ లో ఎలా ఉన్నా వీకెండ్ లో మాత్రం బిగ్ బాస్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. హోస్ట్ గా నాగార్జున రావడం వాళ్లకు క్లాసులు పీకడం.. గొడవలు ఏమన్నా ఉంటే వాటిని సార్ట్ అవుట్ చేయడం.. గేమ్స్ లాంటివి ఆడిస్తుంటారు… దీనితో వీకెండ్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఇక ఈ రోజు హోస్ట్ గా నాగ్ వస్తాడా..? లేదా..? నాగ్ ప్లేస్ లో ఇంకెవరైనా వస్తారా..? అన్న ప్రశ్నలు నిన్నటి నుండి వస్తూనే ఉన్నాయి. ఇక ఈరోజు నాగ్ ప్లేస్ లో సమంత వస్తుందన్న వార్తులు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు బ్రేక్ పడింది. హోస్ట్ ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. స్టార్ మా యాజమాన్యం తమ ట్విట్టర్ ద్వారా రేపు స్పెషల్ ఎపిసోడ్ కు సమంత యాంకరింగ్ చేయనుంది. మరి చూద్దాం మామను కోడలు ఎంతవరకు మరపిస్తుందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీన్నిబట్టి చూస్తే ఈ రోజు ఎపిసోడ్ రోజూ ఎపిసోడ్ లాగే ప్రసారం కానుందన్నమాట. ఇక నిన్న హౌస్ మేట్స్ కష్టపడి తీసిన ప్రేమ మొదలైంది సినిమాను ఈ రోజు ప్లే చేయనున్నారు. అంతేకాదు వారికి అవార్డ్స్ కూడా ఇవ్వనున్నారు. చూద్దాం మరి ఎవరికి ఏ అవార్డువస్తుందో .

మరి ఈ వారం నామినేషన్ లో మోనాల్‌, అవినాష్‌, అభిజిత్‌, దివి, అరియానా, నోయల్‌ ఉన్నారు. వీరిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు..? అసలు ఎలిమినేషన్ ఉందా..? దసరా కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ను తీసేసారా..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seventeen =