‘BB’ అంటే అది కాదు – కన్ఫ్యూజ్ చేస్తున్న నందు

Actor Nandu Quizzes Audience With A Fun Video On Social Media

బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 త్వరలోనే ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంతో ప‌క‌డ్భందీగా బిగ్ బాస్4 షోను నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు నిర్వాహ‌కులు. ఇప్పటికే ఓ ప్రోమోను రిలీజ్ చేసింది కూడా స్టార్ మా. కాగా బిగ్ బాస్‌-4 షోలో మొత్తం 16 మంది పాల్గొన‌బోతుండ‌గా మ‌రోసారి హోస్ట్‌గా నాగార్జున‌ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. యాథావిధిగా 106 రోజుల పాటు ఈ షో జ‌ర‌గ‌నున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కొంత మంది పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎలాగూ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేవరకూ కన్ఫామ్ కాండిడేట్స్ ఎవరో తెలియదనుకోండి. ఇదిలా ఉండగా ఓ కంటెస్టెంట్ తన పేరును రివీల్ చేసేశాడు. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్ అనుకుంటున్నారా? సింగర్ గీతామాధురి భర్త, నటుడు నందు. తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా తను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళుతున్నట్లుగా ప్రకటించారు. ‘‘డార్లింగ్స్.. నేను ‘బిబి’లో ఉన్నాను. ‘బిబి’లో మన రచ్చ మాములుగా ఉండదు. ఈసారి మరింత వినోదం ఉండబోతోంది. మీ సపోర్ట్ కావాలి..’’ అని మరో అప్‌డేట్ రేపు 6 గంటలకు అంటూ తెలిపారు. ఏమైందో తెలియదు కానీ ఆపోస్టు పెట్టిన వెంటనే మరో వీడియో పోస్ట్ చేసి.. అందులో ఎవరితోనో మాట్లాడుతూ.. ‘‘అబ్బే అందులో కాదు సార్.. లేదు మనం అప్పుడనుకున్నాం.. కదా.. దాని గురించి అంతే.. ఇది అది కాదు..’’ అంటూ ఫోన్ పెట్టేశాడు. తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలోని అది ఇది కాదు.. అనే సాంగ్ ప్లే అవుతుంది. మొత్తానికి నందు నెటిజన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మరి నందు చెప్పే ఆ బిబి ఏదో ఏదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

 

 

View this post on Instagram

 

Update !!!

A post shared by Actor Nandu (@that_actor_nandu) on

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =