బిగ్ బాస్ 4 – బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా

బిగ్ బాస్ 4 – నిన్నటి ఎపిసోడ్ పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు చిన్న టాస్క్ ఇచ్చాడు. ఒక మ్యాట్రెస్ ఇచ్చి దానిపై చివరికి ఎవరు మిగులుతారో వారు ఒక‌రోజు ఓ గంట ఎక్కువ సేపు ప‌డుకునే అవ‌కాశం క‌ల్పించాడు. ఇక ఈ ఛాన్స్ కోసం అందరూ పోటీ పడ్డారు. ఒకరిని ఒకరు లాక్కున్నారు. కింద పాడేసుకున్నారు. కానీ ఫైనల్ గా దివి విజ‌యం సాధించింది. దీంతో నేడు ఆమె ఆ బెడ్‌పై ప‌డుకునే ఛాన్స్ కొట్టేయ‌డంతో పాటు ఓ గంట ఆల‌స్యంగా లేచే అవ‌కాశాన్ని పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ వెంటనే బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. గత సీజన్లలో చూసినట్టే ఒక బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా చేసే టాస్క్ . ఇక ఈ టాస్క్ లో అభిజిత్ ద‌ర్శ‌కుడిగా, దివి అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా, అవినాష్ స్క్రిప్ట్ రైట‌ర్‌గా, నోయ‌ల్ డీఓపీగా, అమ్మ రాజ‌శేఖ‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా, లాస్య‌ మేక‌ప్ అండ్ స్టైలిష్, హారిక‌, సోహైల్ ఐట‌మ్ సాంగ్ డ్యాన్స‌ర్లుగా ఉంటారు. ఇక హీరో హీరోయిన్స్ గా అఖిల్మే-మోనాల్ అరియానా, అవినాస్ బావామ‌ర‌ద‌ళ్లుగా నటించారు.. విలన్ గా మెహబూబ్ ను సెలెక్ట్ చేశారు.

ఆ తర్వాత ఎవరి పనిలో వారు పడ్డారు. ఒక వైపు అభి,దివి,అవినాష్,నోయల్, అమ్మ రాజశేఖర్ స్టోరీ డిస్కషన్ లో ఉండగా అఖిల్.. మోనాల్ అక్కడికి వస్తారు. అప్పుడు అభి హీరోయిన్ ఏంటి ఇలా వుంది అని మేక‌ప్ లేకుండా క‌నిపిస్తే మా సినిమా ప‌రువు పోతుంది అని కామెడీ చేయడంతో .. అఖిల్ మేకప్ లేకపోతే అలానే ఉంటుందని చెప్పి మరో పంచ్ వేసాడు. దానితో దివి ఆమెను లోప‌ల‌కు తీసుకెళ్లింది. ఇక ఇక్కడే ఐటెం సాంగ్ విషయంలో అభికి.. అమ్మ రాజశేఖర్ కి చిన్న అర్గ్యూ కూడా జరిగింది.

ఇక అఖిల్‌, మోనాల్‌ను మధ్య కొన్ని సీన్స్.. అరియానా, అవినాష్‌ల మధ్య కొన్ని సీన్స్ తీశారు. ఇక నోయ‌ల్ అరియానాను ఏడిపించే తుంట‌రి అబ్బాయిగా న‌టించాడు. అప్పుడు అవినాష్ సీన్‌లోకి దిగి ఆమెను కాపాడ‌తాడు. డైలాగుల విష‌యంలో అవినాష్‌కు, అభికి బేధాభిప్రాయాలు వ‌చ్చాయి. ఈ విష‌యంలో అఖిల్ అభికి స‌పోర్ట్ చేశాడు. త‌న రెండు సీన్ల‌కే సినిమా మొత్తం నాదే అంటున్నార‌ని స్క్రిప్ట్ రైట‌ర్‌గా తాను డైలాగులు చెప్పినా తీసుకోవ‌డం లేద‌ని.. క్లైమాక్స్ కూడా వ‌ద్దంటున్నార‌ని సోహైల్ తో అవినాష్ తన బాధను చెప్పుకున్నాడు. మరో పక్క ఐటెం సాంగ్ ను కూడా షూట్ చేశారు.

త‌ర్వాత ఓ సీన్ చేయాల్సి ఉండ‌గా అందరూ కామెడీ చేస్తుండటంతో అవినాష్ కాస్త అసహనానికి గురయ్యాడు. అస్త‌మానం ట‌చప్‌లు ఇస్తూ.. జోకులు వేస్తూ కావాల‌ని ఎక్కువ టేకులు తీసుకుంటున్నార‌ని ఈ సీన్‌లో తాను చేయ‌నంటూ అవినాష్ వెళ్ళిపోయాడు. తర్వాత అరియనా సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఇంతవరకు అన్నం కూడా తినకుండా వెయిట్ చేస్తున్నానని.. షూటింగ్‌లో సీరియ‌స్‌గా ఉండ‌క‌పోతే త‌న‌కు న‌చ్చ‌ద‌ని చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా వెళ్లి మిగిలిన సీన్ కూడా పూర్తి చేసాడు. ఫైనల్ గా అర్ధ‌రాత్రి మూడున్న‌ర‌కు సినిమా పూర్తి చేశారు.

ఇక ఈ సినిమా ఈ రోజు ఎపిసోడ్ లో ప్రసారం కానుంది. మరి ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరు ఇంటిని వదిలి పెట్టి వెళ్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =