
ట్యాగ్ · 14 కథనాలు


మోహన్ లాల్ 'మాన్‌స్టర్' రిలీజ్ పై క్లారిటీ..!

"మరక్కార్ " మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘మరక్కార్’

"మరక్కార్ "మూవీ టీజర్ 2 రిలీజ్

అమెజాన్ ప్రైమ్ లో 'మరక్కార్'

మమ్ముట్టి 50 సంవత్సరాల సినీ జర్నీ

"దృశ్యం 2" మూవీ షూటింగ్ పూర్తి
ఐఎఎస్ ఆఫీసర్ గా శ్రద్ధా శ్రీనాథ్
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
మోహన్ లాల్ ఆర్గానిక్ ఫార్మింగ్
'దృశ్యం 2' మొదలుపెట్టిన మోహన్‌లాల్

వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్
మాలీవుడ్ సూపర్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత నటుడు మోహన్‌లాల్ శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే మోహన్‌లాల్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

మోహన్ లాల్ 'మాన్‌స్టర్' రిలీజ్ పై క్లారిటీ..!
మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మోహన్ లాల్ కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక మోహన్ లాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తన డబ్బింగ్ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తున్నా.. అప్పుడప్పుడు జనతా గ్యారెజ్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు 'మాన్‌స్టర్' సినిమాతో రానున్నారు మోహన్ లాల్. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మన్యంపులి సినిమా మంచి విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

"మరక్కార్ " మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ప్రియదర్శన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా 16వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదిరించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కార్ జీవితం ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ”మలయాళ మూవీ డిసెంబర్ 3వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ భాష తో పాటు తెలుగు , కన్నడ ,తమిళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ , అర్జున్ సర్జా , మంజు వారియర్ , అశోక్ సెల్వన్ , సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.ప్రణవ్ మోహన్ లాల్, ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు , సిద్ధిఖ్ , సుహాసిని మణిరత్నం , నెడుముడి వేణు…

రవివర్మ పెయింటింగ్ ఇన్స్ పిరేషన్ తో కీర్తి సురేష్ లుక్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ప్రియదర్శన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా 16వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదిరించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ”మలయాళ మూవీ డిసెంబర్ 3వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ భాష తో పాటు తెలుగు , కన్నడ ,తమిళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ , అర్జున్ సర్జా , మంజు వారియర్ , అశోక్ సెల్వన్ , సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ – దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు , సిద్ధిఖ్…

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘మరక్కార్’
మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

"మరక్కార్ "మూవీ టీజర్ 2 రిలీజ్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ప్రియదర్శన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ ,లాల్ హీరోగా తెరకెక్కిన "మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ"మలయాళ మూవీ డిసెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ భాష తో పాటుతెలుగు , కన్నడ ,తమిళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ , అర్జున్ సర్జా , మంజు వారియర్ , అశోక్ సెల్వన్ , సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ - దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు , సిద్ధిఖ్ , సుహాసిని మణిరత్నం , నెడుముడి వేణు , ఫాజిల్ , రంజిఫణిక్కర్ , హరీశ్ పేరడి , ఇన్నోసెంట్ ఇతర పాత్రల్లో…

'మరక్కార్'.. కీర్తి సురేష్ న్యూ పోస్టర్ రిలీజ్
ప్రియదర్శన్ దర్శకత్వంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ మరక్కార్. కేరళ నేవీ ఆఫీసర్‌గా చేసిన కుంజాలీ మరక్కార్ 4 జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 2న ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ లో 'మరక్కార్'
కరోనా సెకండ్ వేవ్ తరువాత ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు డైరెక్ట్ ఓటీటీ బాట పట్టగా ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈసినిమా మరేదో కాదు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ మరక్కార్.

మమ్ముట్టి 50 సంవత్సరాల సినీ జర్నీ
"అనుభవంగల్ పలిచకల్"(1971 ) మూవీ తో మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మమ్ముట్టి సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. మలయాళ మెగాస్టార్‌గా పాపులారిటీ సాధించిన మమ్ముట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో 400 చిత్రాలకి పైగా నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్ లాంటి స్టార్స్‌తోమమ్ముట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన "స్వాతి కిరణం"మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత…

"దృశ్యం 2" మూవీ షూటింగ్ పూర్తి
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం "మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న "దృశ్యం " మూవీ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , సింహళ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చైనీస్ భాషలో రీమేక్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీ గా "దృశ్యం " మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఐఎఎస్ ఆఫీసర్ గా శ్రద్ధా శ్రీనాథ్
సక్సెస్ ఫుల్ "కోహినూర్ "(2015 ) మలయాళ మూవీ తో కెరీర్ ను ప్రారంభించిన శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ , తమిళ , హిందీ మూవీస్ లో నటించారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ మూవీ లో మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "కృష్ణ అండ్ హిజ్ లీల " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం 2 తమిళ , 2కన్నడ , "నరుడి బ్రతుకు నటన "తెలుగు మూవీ లో నటిస్తున్నారు.
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రేక్షకులను అలరించి మీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు. పలు భాషల మూవీస్ కు మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మీనా , రజనీకాంత్ "అన్నాత్తే "(తమిళ ), మోహన్ లాల్ "దృశ్యం 2 " మూవీస్ లో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలోమోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మలయాళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. "దృశ్యం "మూవీ పలు భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
మోహన్ లాల్ ఆర్గానిక్ ఫార్మింగ్
కరోనా వల్ల కొంత నష్టం ఉన్నా కూడా కొన్ని లాభాలు అయితే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన సెలబ్రిటీస్ కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ఇంటిపని, వంటపనిలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ముఖ్యంగా బయట ఫుడ్ ను చాలా వరకూ ఆపేసి ఇంట్లో ఫుడ్ కే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతేకాదు కొంతమంది సెలబ్రిటీస్ అయితే ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సమంత ఈ ఛాలెంజ్ ను మొదలుపెట్టింది కూడా. అంతేకాదు ఇంట్లోనే మనకు కావాల్సిన కూరగాయాలు ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పెంచుకోవాలో కూడా టిప్స్ చెపుతుంది.
'దృశ్యం 2' మొదలుపెట్టిన మోహన్‌లాల్
మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూజోసఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.