మోహన్ లాల్ ‘మాన్‌స్టర్‌’ రిలీజ్ పై క్లారిటీ..!

Heres a Clarity on Mohanlals Monster Movie Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Monster,Monster Movie,Monster Telugu movie,Monster Movie Updates,Monster latest News,Monster Clarity on Movie Release, Monster Latest Updates,Mohanlal,Star Hero Mohanlal,Actor Mohanlal,Mohanlal Upcoming Movie Monster,Monster Movie Latest Release Updates, Monster Movie Makers Gives Clarity on Mohanlal Movie Release,Monster Movie Not Releasin in OTT,Monster Movie Theater Release Update Soon

మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మోహన్ లాల్ కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక మోహన్ లాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తన డబ్బింగ్ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తున్నా.. అప్పుడప్పుడు జనతా గ్యారెజ్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ‘మాన్‌స్టర్‌’ సినిమాతో రానున్నారు మోహన్ లాల్. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మన్యంపులి సినిమా మంచి విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు కూడా సిద్దమైంది. కానీ ఈమధ్య ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మేకర్స్ మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందంటున్నారు.

కాగా ఈసినిమాలో మంచు లక్ష్మీ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =