ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ప్రియదర్శన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ ,లాల్ హీరోగా తెరకెక్కిన “మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ”మలయాళ మూవీ డిసెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ భాష తో పాటుతెలుగు , కన్నడ ,తమిళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ , అర్జున్ సర్జా , మంజు వారియర్ , అశోక్ సెల్వన్ , సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ – దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు , సిద్ధిఖ్ , సుహాసిని మణిరత్నం , నెడుముడి వేణు , ఫాజిల్ , రంజిఫణిక్కర్ , హరీశ్ పేరడి , ఇన్నోసెంట్ ఇతర పాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
16వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “మరక్కార్ “మూవీకి రోనీ రాఫెల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రయూనిట్ “మరక్కార్ “మూవీ టీజర్ 2 ను రిలీజ్ చేసింది. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: