కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Akkineni Nagarjuna

ట్యాగ్ · 16 కథనాలు

సినిమా వార్తలు

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు "

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు " మూవీ ఘనవిజయం సాధించింది. సొనాలీ బింద్రే , అన్షు కథానాయికలు. "మన్మథుడు " మూవీ కి స్టోరీ , డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను అలరించింది. హీరో నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - నాగ్ ఈజ్ బ్యాక్

బిగ్ బాస్ 4- ఈరోజు వీకెండ్.. అందరూ రోజూ బిగ్ బాస్ చూస్తారో లేదో తెలియదు కానీ.. ఈ రోజు మాత్రం రోజూ చూడని వాళ్ళు కూడా చూస్తుంటారు. ఎందుకంటే హోస్ట్ రావడం.. హౌస్ మేట్స్ ఏమైనా తప్పులు చేస్తే వారికి క్లాసులు పీకడం.. ఎవరెవరికి ఎలాంటి ఇష్యూస్ ఉంటే వాటికి క్లారిటీ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్ కోసం కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఎవరు హోస్ట్ గా వస్తారన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఎందుకంటే నాగార్జున షూటింగ్ కోసం మనాలి వెళ్లడమే కారణం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యాక్షన్ సీన్స్ లో నాగార్జున

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరో గా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ "వైల్డ్ డాగ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దియా మీర్జా , సయామీ ఖేర్ కథానాయికలు. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు "వైల్డ్ డాగ్" మూవీ 70శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'వైల్డ్ డాగ్' - నాగ్ కోసం స్టంట్స్ కంపోజ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి

ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో ఉన్నసంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్ళింది చిత్రయూనిట్. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని మ‌నాలీలో మొద‌లైంది. దాదాపు మూడు వారలు అక్కడే నిర్విరామంగా షూటింగ్ చేసుకోనున్నారు. సుదీర్ఘంగా కొన‌సాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో స‌హా ప్రధాన పాత్రధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'హిమాలయాల్లో' వైల్డ్ డాగ్ - 3980 మీట‌ర్ల ఎత్తులో షూట్

ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ చేశారు. ఇక ఇన్ని రోజులు ఇక్కడే చిత్రీకరణ జరుపుకున్న చిత్రబృందం ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక అక్కడకు వెళ్లిన నాగ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వీడియో ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Nagarjuna Akkineni Wild Dog Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

నాగార్జున "వైల్డ్ డాగ్ "మూవీ అప్ డేట్

తమిళ సూపర్ స్టార్ , తలైవా ఆధ్యాత్మిక చింతనతో తరచూ హిమాలయాలకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నాగార్జున షూటింగ్ కై హిమాలయాలకు వెళ్ళారు. కరోనా కారణంగా స్టార్ హీరోస్ సుమారు 7నెలలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. 60 సంవత్సరాల నాగార్జున ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 4 కు నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. కంటిన్యూ గా బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్న నాగార్జున ఇప్పుడు "వైల్డ్ డాగ్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అన్న‌పూర్ణ స్టూడియోస్' పై వార్తలు నమ్మొద్దు

అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్నట్టు ఈ రోజు ఉదయం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ స‌ర్క్యూట్ జ‌ర‌గ‌డంతో ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్టు తెలుస్తుంది. అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే స్పందించి సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మంట‌ల్ని ఆర్పివేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ న‌ష్టం ఏమి జ‌ర‌గకపోగా, ఆస్తి న‌ష్టం కూడా పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు.

TFN Adminవాట్సాప్
Mani Ratnam Geethanjali Movie Remains To Be A Trendsetter Of That Era
సినిమా వార్తలు

డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి

సి ఎల్ నరసారెడ్డి సమర్పణ లో భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "గీతాంజలి " మూవీ ఘనవిజయం సాధించింది. గిరిజ కథానాయిక. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "గీతాంజలి " మూవీ వివిధ విభాగాలలో 6 నంది అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

అన్ని జాగ్రత్తలతో 'వైల్డ్ డాగ్' షూట్ మొదలు

లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్‌తో పాటు బిగ్ బాస్ 4 షూటింగ్‌లో పాల్గొననున్న‌ట్టు తెలిపారు. ఇక తాజాగావైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్నారు నాగ్. అంతేకాదు వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొనడం చాలా ఫన్ గా ఉందని.. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నామని.. ఒక వీడియో కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు వైల్డ్ డాగ్ తర్వాత…

TFN Adminవాట్సాప్
Tollywood Actor Nagarjuna Shares His Excitement With Audience On Joining Shoot of Bigg Boss Season 4
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ షూటింగ్ కు వెళ్తున్నా

లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలుపుతున్నారు. ఈ రోజు త‌న 61వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా నాగార్జున వైల్డ్ డాగ్ నుండి స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 'వైల్డ్ డాగ్' బృందంలో స‌భ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెష‌ల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హ‌ష్వంత్ మ‌నోహ‌ర్…

TFN Adminవాట్సాప్
Wild Dog Movie Team Unveils First Look Movie Poster On Akkineni Nagarjuna Birthday
ఫస్ట్ లుక్

డేర్ డెవిల్ కు హ్యాపీ బర్త్ డే

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని అగ్ర హీరో స్థాయి రేంజ్ కు ఎదిగారు టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున. టాలీవుడ్ మన్మధుడు అనే బిరుదుకు తగ్గట్టేఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఆ బిరుదుకు సార్ధకం చేస్తున్నారు. క్లాస్.. మాస్ సినిమాలే కాదు భక్తిరస చిత్రాలకు కూడా నాగ్ కేరాఫ్ అడ్రస్. తన ఇన్నేళ్ల సినీప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. ఇక ఈ రోజు నాగ్ పుట్టినరోజు కావడంతో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెపుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానికి బ్రెయిన్ ట్యూమర్ - నాగార్జున ఫోన్ కాల్

కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. తమ హీరోలకు అభిమానులంటే ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను... అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

నాగ్ 'వైల్డ్ డాగ్' టీజర్ అప్పుడేనా..?

గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'నాగ్' బ్యాక్ టు షూట్ - కెమెరా..యాక్షన్..!

బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూడు సీజన్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ పొందిన ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగ్ కంటెస్టెంట్ లను ఒక ఆట ఆడించేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్ బాస్4 ప్రోమో కోసం నాగ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తాజాగా షేర్ చేశాడు. బ్యాక్ టు ఫ్లోర్.. లైట్స్, కెమెరా, యాక్షన్ వావ్ వావ్ వావ్ అంటూ ట్వీట్ చేసాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కెకె సెంథిల్ ఆధ్వర్యంలో షూటింగ్ జరుగుతోందట…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాగార్జున కు జోడీగా ఇలియానా ?

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "PSV గరుడ వేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో నాగార్జున కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా ను ఎంపిక చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా..!

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు 'గరుడ వేగ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే…

TFN Adminవాట్సాప్

షేర్