లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్‌తో పాటు బిగ్ బాస్ 4 షూటింగ్లో పాల్గొననున్నట్టు తెలిపారు. ఇక తాజాగావైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్నారు నాగ్. అంతేకాదు వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొనడం చాలా ఫన్ గా ఉందని.. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నామని.. ఒక వీడియో కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు వైల్డ్ డాగ్ తర్వాత బిగ్ బాస్ 4 షూటింగ్ లో కూడా పాల్గొనాలి తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It was fun shooting for #WildDog and now getting ready for #BiggBossTelugu4 day after!!
Lights, camera, Action 🎬
With all the safety precautions #WildDog Shoot Resumes.
Checkout here – https://t.co/ztwFWLBQaV@iamnagarjuna @ahishor @deespeak @SaiyamiKher @Deonidas @MatineeEnt— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 3, 2020
గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: