‘నాగ్’ బ్యాక్ టు షూట్ – కెమెరా..యాక్షన్..!

Tollywood Actor Akkineni Nagarjuna Joins Promo Shooting Of Bigg Boss Season 4 Show

బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూడు సీజన్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ పొందిన ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగ్ కంటెస్టెంట్ లను ఒక ఆట ఆడించేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్ బాస్4 ప్రోమో కోసం నాగ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తాజాగా షేర్ చేశాడు. బ్యాక్ టు ఫ్లోర్.. లైట్స్, కెమెరా, యాక్షన్ వావ్ వావ్ వావ్ అంటూ ట్వీట్ చేసాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కెకె సెంథిల్ ఆధ్వర్యంలో షూటింగ్ జరుగుతోందట. త్వరలోనే ప్రోమోను విడుదల చేయనున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక బిగ్‌బాస్ 4 కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ సారి లిస్ట్‌లో సింగర్ సునీత, హేమచంద్ర, వైవా హర్ష, హంసా నందిని, యామినీ భాస్కర్, నందు, అఖిల్ సార్ధిక్, మంగ్లీ, జబర్దస్త్ నరేష్ వంటి వారున్నారని తెలుస్తోంది. ఈసారి మాత్రం 50 రోజులు మాత్రం షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. నిబంధనలు ప్రకారం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఈ షోను నిర్వహించనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =