డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Dear Comrade Movie Release Date Fixed,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Gets a Release Date,Dear Comrade Release Date Announced,Dear Comrade Release Date Locked,Dear Comrade Release Date Revealed,Dear Comrade Movie Latest Updates,Dear Comrade Release Date
Dear Comrade Movie Release Date Fixed

గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొంద, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈసినిమాను మే 31న రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే అదే రోజు ఎన్జీకే సినిమా కూడా రిలీజ్ ఉండటంతో వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. జులై 26వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాగా లవ్‌ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తున్న విజయ్ దేవరకొండ కాకినాడ యాసలో అలరించనున్నాడు. రష్మిక మందనా మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది. మరి గీతగోవిందం సినిమాతో హిట్ కొట్టిన.. ఈ హిట్ కాంబో.. డియర్ కామ్రెడ్ సినిమాతో హిట్ అందుకుంటుందో.. లేదో.. చూద్దాం..

[subscribe]
[youtube_video videoid=n3AqEHg6ofI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =