మే 9… కేరాఫ్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌

May 9th - A Very Special Day For Tollywood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Special Day For Tollywood,May 9th Special Day For TFI,May 9th Success Wins in Film Industry
May 9th - A Very Special Day For Tollywood

మే 9… తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి క‌లిసొచ్చిన తేదీ. గ‌తంలో ఇదే తేదికి రిలీజైన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. అంతేకాదు… కెరీర్‌లో ల్యాండ్ మార్క్ మూవీస్‌గా నిలిచాయి. ఆ జ్ఞాప‌కాల్లోకి వెళితే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1990 మే 9… మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైన రోజు. అగ్ర నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం… కాసుల పంట పండించింది. చిరు కెరీర్‌లో మెమ‌ర‌బుల్ ఫిల్మ్‌గా నిల‌చిందీ సోషియో ఫాంట‌సీ ఫిల్మ్‌. క‌ట్ చేస్తే… మ‌ళ్ళీ అదే మే 9వ తేదీన ఏడాది త‌రువాత అంటే 1991లో చిరు నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ విడుదలయ్యింది. విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇలా… బ్యాక్ టు బ్యాక్ ఇయ‌ర్స్‌లో ఒకే తేదికి చిరు రికార్డు స్థాయి విజ‌యాల‌ను అందుకోవ‌డం విశేషం.

ఇక ఆరేళ్ళ తర్వాత అంటే 1997లో ఇదే తేదీని టార్గెట్ చేసుకుని విక్ట‌రీ వెంకటేష్, దర్శకుడు జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌లో రూపొందిన‌ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ప్రేమించుకుందాం…రా!’ తెరపైకి వచ్చింది. వెంకీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్ గా నిల‌చింది. అలాగే… 2002లో ఇదే రోజున‌ కింగ్ నాగార్జున, దర్శకుడు దశరథ్ కలయికలో తెరకెక్కిన ‘సంతోషం’ విడుదలైంది. కుటుంబ ప్రేక్ష‌కులను అలరించిన ఈ సినిమా విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. క‌ట్ చేస్తే… 2018లో సి. అశ్వనీదత్ మరోసారి తనకు అచ్చొచ్చిన తేదీని టార్గెట్ చేస్తూ… మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ని విడుదల చేసాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు ద‌క్కించుకుంది. అలాగే… టైటిల్ రోల్‌లో న‌టించిన కీర్తి సురేష్‌కి ఈ సినిమా మెమ‌ర‌బుల్ ఫిల్మ్‌గా నిల‌చింది.

ఈ నేప‌థ్యంలో… ప‌లువురికి మెమ‌ర‌బుల్ డేట్‌గా నిల‌చిన ఇదే తేదిన నేడు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ తెర‌పైకి రానుంది. మ‌హేష్ కెరీర్‌లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్‌గా (హీరోగా 25వ చిత్రం) వ‌స్తున్న ఈ చిత్రం కూడా అదే బాట‌లో ప‌య‌నించి… మెమ‌ర‌బుల్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.

[subscribe]
[youtube_video videoid=FarYE-EAuAw ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + ten =