అవతార్ 2,3,4 5 రిలీజ్ డేట్స్ ఫిక్స్

Avatar Movie Sequels Release Dates Fixed,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avatar Sequels Release Date Revealed,Avatar Movie Sequels Release Dates Locked,Avatar Movie Sequels Latest Updates,Avatar Sequels Release Dates,Release Dates of Avatar Movie Sequels,Avatar Movie Sequels Release Date Announced
Avatar Movie Sequels Release Dates Fixed

టైటానిక్ ఫేమ్ జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్‌ అవతార్ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసింది. అత్యధిక వసూళ్లు సాధించి ఈ సినిమా ఆల్‌టైం రికార్డ్‌ను సృష్టించింది. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా సీక్వెల్స్ ను తెరకెక్కించనున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అవతార్ 2, 3, 4 మరియు 5 సీక్వెల్స్ ను తెరకెక్కించనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నాలుగు సీక్వెల్స్ లా రిలీజ్ డేట్ల ను కూడా ముందే ప్రకటించారు.

2021 డిసెంబర్ 17న అవతార్ సీక్వెల్ 2 ను రిలీజ్ చేయనున్నారు. ముందు ఈ సీక్వెల్ ను 2020 డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే కొన్ని నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఏడాది వాయిదా వేశారు.

అవతార్ సీక్వెల్ 3.. 2023 డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.
అవతార్ సీక్వెల్ 4.. 2025 డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.
అవతార్ సీక్వెల్ 5.. 2027 డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.

మొత్తానికి అవతార్ లవర్స్ కు ఇది గుడ్ న్యూసే. మరి చూద్దాం ఈ సీక్వెల్స్ అన్నీ చెప్పిన రిలీజ్ డేట్ కు రిలీజ్ చేస్తారో ? లేదో?

[subscribe]
[youtube_video videoid=SVe_MFEHYOQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 13 =