టాలీవుడ్ లో నాని, నితిన్, నాగ చైతన్య, శర్వానంద్, వరుణ్ తేజ్, సుధీర్ బాబు, రానా, నాగ శౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయవంటి యంగ్ హీరోలు ఉన్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరో లు సంవత్సరానికి ఒక మూవీ మించి నటించడం లేదు. సీనియర్ దర్శకులు, యువ దర్శకులు యువ హీరోలతో సినిమాలు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ లో యువ దర్శకులు తమ వయసుకు తగ్గట్టు కథలను రూపొందించడం తో యువ హీరోలు సంవత్సరానికి 2లేదా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా రిలీజయిన నాని జెర్సీ మూవీ ఘనవిజయం సాధించింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో V మూవీ లో నాని నటిస్తున్నారు. మరికొన్ని కథలను కూడా నాని ఓకే చేశారని సమాచారం. వెంకీ కుడుముల భీష్మ, చంద్ర శేఖర్ యేలేటి, కృష్ణ చైతన్య సినిమాలు చేస్తున్నట్టుగా హీరో నితిన్ ప్రకటించారు. నాగ చైతన్య నటించిన మజిలీ మూవీ ఘనవిజయం సాధించింది. వెంకీ మామ మూవీ ని ఓకే చేసిన విషయం తెలిసిందే. దర్శకులు అజయ్ భూపతి, త్రినాథ రావు నక్కిన, మేర్లపాక గాంధీ, దిల్ రాజు బ్యానర్ లో ఒక కొత్త దర్శకుడు నాగ చైతన్య కు కథలు సిద్ధం చేస్తున్నారు.
సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ త్వరలో రిలీజ్ కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో ఒక మూవీ ,రెండు ద్వి భాషా చిత్రాలకు ఓకే చేసినట్టు సమాచారం. రానా దగ్గుబాటి గుణ శేఖర్ హిరణ్య కశప , వేణు ఊడుగుల విరాటపర్వం 1992 మూవీస్ లో నటించనున్నారు. ఇద్దరు యువ దర్శకులు రానాకు కథలు సిద్ధం చేస్తున్నారు. వాల్మీకి మూవీ లో నటిస్తున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం ఉన్న మూవీ లో నటించనున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం లో ఒక మూవీ, తమిళ మూవీ 96 రీమేక్ మూవీ షూటింగ్స్
తో శర్వానంద్ బిజీగా ఉన్నారు. సుధీర్ బాబు V సినిమాతో పాటు పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీ లో నటించనున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయ, సందీప్ కిషన్ కూడా రెండేసి సినిమాలకు కమిట్ అయినట్టు సమాచారం.
[subscribe]
[youtube_video videoid=DQ1T0GI3g4Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: