కిరణ్ స్టూడియోస్ బ్యానర్ పై నిజార్ షఫీ దర్శకత్వంలో రెహమాన్, హవిష్, రెజీనా కసాండ్ర, నందిత శ్వేత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి తారాగణం గా రూపొందిన 7 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు రమేష్ వర్మ నిర్మించిన 7 మూవీ లో రెహమాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్, 7 మూవీ కి సంగీతం సమకూర్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన 7 మూవీ ఫస్ట్ లుక్, టీజర్, మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజయిన లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 7 మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ మే 9వ తేదీ రిలీజ్ చేయనుంది.భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు వంటి సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నిజార్ షఫీ దర్శకత్వంలో థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుందనడం లో సందేహం లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























