ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కొలైగారన్. దియా మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాలో అషిమా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్ కిల్లర్ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మర్డర్ మిస్టరీ.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సైమన్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జూన్ తొలి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిర్మాతలు టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్ మాట్లాడుతూ-“ క్రైమ్ జోనర్ లో యూనిక్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్ తో రక్తి కట్టిస్తుంది. అర్జున్ నటన సినిమాకే హైలైట్. విజయ్ ఆంటోని పాత్ర ఏమిటన్నది.. సస్పెన్స్. తెలుగు వెర్షన్ నాణ్యతతో చేస్తున్నాం.. అన్ని వర్గాల్ని మెప్పించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది.. ఇటీవలే దుబాయ్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలతో చిత్రీకరణ పుర్తి చేసుకున్నాం. విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది . మే రెండవ వారంలో ట్రైలర్ విడుదల చేస్తున్నాం . రంజాన్ కానుకగా జూన్ తొలి వారంలో సినిమా విడుదల చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నాం అని అన్నారు.
అర్జున్ ,విజయ్ ఆంథోని , అషిమా నర్వాల్ ,నాజర్ ,సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి:మాటలు, పాటలు: భాష్యశ్రీ,సంగీతం: సైమన్ కె.కింగ్, ఛాయాగ్రహణం: మ్యూక్స్, ఎటిడింగ్: రిచర్డ్ కెవిన్.ఎ, పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: వినోద్ రాజ్ కుమార్, నిర్మాతలు: టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్, రచన- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.
[subscribe]
[youtube_video videoid=SVe_MFEHYOQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























