పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో పలు ఘనవిజయాలున్నాయి. వాటిలో… ‘గబ్బర్ సింగ్’(2012) ఒకటి. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీనాట ఘన విజయం సాధించిన ‘దబాంగ్’(2010)కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. విశేషమేమిటంటే… ఈ రెండు వెర్షన్లు కూడా ఆ యా స్టార్ హీరోల వరుస పరాజయాలకు బ్రేక్ వేయడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే.. 2012లో ‘దబాంగ్ ’కు సీక్వెల్‌గా రూపొందిన ‘దబాంగ్ 2’లో నటించాడు సల్మాన్ . ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబట్టింది. ఈ నేపథ్యంలో… ఇప్పుడు ‘దబాంగ్’ సిరీస్‌లో మూడో భాగంగా… ‘దబాంగ్ 3’ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విశేషముంది.
అదేమిటంటే… ఈ సినిమాకి సౌత్ కనెక్షన్ ఉంది. ఎలాగంటే… ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవా తమిళయన్ కాగా… కన్నడిగ ‘కిచ్చా’ సుదీప్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే… కమెడియన్‌గా తెలుగు నటుడు అలీ నటిస్తున్నాడు. మొత్తమ్మీద… ఒక హిందీ సినిమాని తమిళ దర్శకుడు తెరకెక్కించడం… ఆ సినిమాలో కన్నడ నటుడు విలన్‌గా నటించడం, కమెడియన్‌గా ఓ తెలుగు నటుడు నవ్వులు పూయించడం రేర్ ఫీట్ అనే చెప్పాలి. హిందీ సినిమాకి సౌత్ ఫ్లేవర్‌ని తీసుకొచ్చి ఈ సినిమాపై దక్షిణాదిన కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నారన్నమాట. మరి సౌత్ ఫ్లేవర్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: