పన్నెండేళ్ల పయనంలో కాజల్ ఖాతాలో 12 సూపర్ హిట్స్

2019 Latest Telugu Movie News, Actress Kajal Aggarwal Birthday Special News, Actress Kajal Aggarwal Birthday Special Poll, Best Films of Kajal Aggarwal, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Top 10 Movies of Kajal Aggarwal, Wishing a Very Happy Birthday to Kajal
Actress Kajal Aggarwal Birthday Special Poll

హీరోయిన్ల కెరీర్ స్పాన్ రానురానూ తగ్గిపోతోంది. రెండు మూడేళ్ల కెరీర్లో ఐదారు సినిమాలు చేసి ఇంటి ముఖం పడుతున్నారు చాలా మంది హీరోయిన్లు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే తాపత్రయంతో ఒకటి రెండు హిట్లు రాగానే రేట్లు పెంచి, అన్ని సినిమాలు ఒప్పుకుని చివరకు డేట్లు ఎడ్జెస్ట్ చేయలేక నిర్మాతలను ఇబ్బందులపాలు చేసి చివరకు ఒకటి రెండు ప్లాపులు రాగానే కనుమరుగై పోతుంటారు చాలామంది హీరోయిన్లు. కానీ కొద్ది మంది హీరోయిన్లు మాత్రం ఒక లాంగ్ విజన్ తో లాంగ్ ఇన్నింగ్స్ ఆడే లక్ష్యంతో కెరీర్ ను జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటారు.

అలాంటివారు విభిన్న పాత్రలు చేస్తూ సుదీర్ఘకాలం పాటు కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తారు… అగ్రశ్రేణి కథానాయికలుగా కొనసాగుతారు. ప్రస్తుతం అలాంటి లాంగ్ విజన్ తో అద్భుత విజయాలతో లాంగెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ కెరీర్ను కొనసాగిస్తున్న టాప్ ర్యాంకింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు తమిళ చిత్ర రంగాలకు దాదాపుగా ఒకే సమయంలో హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగ్రశ్రేణి కథానాయికగా ఎదగటానికి ఎంతో కాలం పట్టలేదు. తొలి రోజుల్లో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీఅందం- అభినయాల సమాహారమైన కాజల్ చూస్తుండగానే టాలీవుడ్ కోలీవుడ్లలో టాప్ ర్యాంకర్ గా ఎదిగింది.

2007లో “లక్ష్మి కళ్యాణం” ద్వారా తేజ పరిచయం చేసిన కాజల్ కు కృష్ణవంశీ ” చందమామ” తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత పౌరుడు, ఆటాడిస్తా చిత్రాలు ఆశించినంత విజయవంతం కాలేదు. అటువైపు తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో ఆమె చేసిన మొదటి మూడు చిత్రాలు సక్సెస్ కాలేదు. అసలు అంతకుముందే 2004లో హిందీలో ఆమె పరిచయ చిత్రం” క్యోం! హో గయా నా” కూడా సక్సెస్ కాలేదు.

ఇలా మూడు భాషలలో ఫెయిల్యూర్స్ తో కెరీర్ ప్రారంభించిన కాజల్ 3 భాషల్లోనూ అద్భుత విజయాలను అందుకుని ఓడిన చోటే గెలిచి చూపించింది.2009లో వచ్చిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన” మగధీర” కాజల్ ను అమాంతం ఆకాశానికెత్తేసింది. అప్పటినుండి అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయిన కాజల్ ఇప్పటివరకు తెలుగు,తమిళ, హిందీ భాషలలో 54 చిత్రాల్లో నటించగా వాటిలో 31 తెలుగు చిత్రాలు ఉన్నాయి.. ఈ 31 చిత్రాలలో 12 చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ కాగా కొన్ని యావరేజ్ లు, కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూస్తే 80 పర్సెంట్ సక్సెస్ రేటు తో తన ర్యాంకింగ్ ను కొనసాగిస్తుంది.12 ఏళ్ల తర్వాత కూడా ఒక హీరోయిన్ తన రేంజిని, ర్యాంకును, గ్లామర్ ను ఒకే స్థాయిలో కొనసాగించటం చాలా అరుదైన విశేషం.

ఈ పన్నెండేళ్లలో బహుభాషా నటిగా అద్భుత విజయాలను అందుకున్న కాజల్ బర్త్డే ఈరోజు.1985 జూన్ 19న జన్మించిన కాజల్ ఈరోజుతో 34 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 వ పడిలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా కాజల్ టాప్ హిట్స్ లో
ద బెస్ట్ ఏది? అని సరదాగా ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ ఇందులో మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తుంది మీ “ద తెలుగు ఫిల్మ్ నగర్.కం” .
ఇంతకూ కాజల్ టాప్ హిట్స్ ఏమిటో ఈ కింద ఇచ్చిన జాబితాలో చూడండి.

ఈ జాబితా నుండి “ద బెస్ట్ ఆఫ్ కాజల్” ను ఎంపిక చేసి కాజల్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పండి.
Your voting is your Greeting..So…. vote and greet the Ever Green Kajal Aggarwal.

కాజల్ 12 హిట్స్ లోద బెస్ట్ ఏది ?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=bZWrRQxzpJI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here