రిలీజ్ డేట్స్ మారిపోయాయి

2019 Latest Telugu Movie News, change in release dates of latest telugu movies, Ranarangam And Evaru Movies Release Dates Postponed, Ranarangam Movie postponed, Sharwanand starrer Ranarangam release postponed, Adavi sheshu Evaru Gets A New Release Date, Adavi sheshu starrer Evaru movie postponed, Ranarangam Movie Gets A New Release Date, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News

ఇక నెలలో ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ తప్పించి పెద్దగా అంచనాలు ఉన్న సినిమాలు ఏం లేవని చెప్పొచ్చు. అయితే ఆగష్ట్ లో మాత్రం మంచి మంచి సినిమాలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక ఆగష్ట్ అంటే ఎన్ని సినిమాలు ఉన్న మన మైండ్ లో ఫిక్స్ అయిన ఒకే సినిమా సాహో. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగష్ట్ 15న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మన్మథుడు2, రణరంగం, ఎవరు, గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటిలో కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కే వస్తుండగా కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ డేట్ ను మార్చుకున్నాయి. వీటిలో ఎవరు, రణరంగం సినిమాలు ఉన్నాయి. అడివి శేష్, రెజీనా కసాండ్ర హిరో హిరోయిన్లుగా వస్తున్న సినిమా ఎవరు. మొదట ఈ సినిమాను ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చుతూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు.

ఇక రణరంగం సినిమా కూడా వాయిదా పడింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన చిత్రం ‘రణరంగం’. టీజర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను మొదట ఆగష్టు 2వ తేదీన విడుదలచేయాలని అనుకున్నారు నిర్మాతలు. ఆ తేదీని అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. అయితే ఆ డేట్ కు రిలీజ్ చేయడం కష్టమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అనుకున్నట్టే రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆగష్టు 2 నుండి ఆగష్టు 15కి వాయిదా వేశారు.

మరి మిగిలిన సినిమాలు కూడా చెప్పిన డేట్ కే వస్తాయా?లేదా? అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=BXxQ9I8y1rA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 2 =