రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కందరం కొండన్. తెలుగులో ‘మిస్టర్ kk’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న విక్రమ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయట. కథ నడుస్తున్న కొద్దీ.. అసలు ఈ సినిమాలో విక్రమ్ హీరోనా? విలనా? అనే అయోమయానికి ప్రేక్షకులు లోనవుతారని అంటున్నారు. అలాగే ఈ మూవీ మొత్తం ఒకరోజు జరిగే కథ కావడంతో కథనంగా ఎక్కడా నెమ్మదించకుండా వేగంగా సాగిపోతుందట. అంతేకాదు.. ఈ సినిమాలో విక్రమ్ చేసే స్టంట్స్ ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతారు. ఫ్రాన్స్ కి చెందిన స్టంట్స్ కొరియోగ్రఫర్ ‘గింట్’ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.
కాగా ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విక్రమ్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=dFixoarIk0c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: