మన్మథుడు 2 – సాలిడ్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్

2019 Latest Telugu Movie News, Manmadhudu 2 movie Pre Release news, Manmadhudu 2 Movie Updates, Manmadhudu 2 Pre Release Business Report, Manmadhudu 2 Release Date, Manmadhudu 2 telugu movie Pre Release Business, Manmadhudu 2 Worldwide Pre Release Business, Nagarjuna Manmadhudu 2 Pre Release updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Manmadhudu 2 Pre Release Business Report

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఇక ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. అన్ని కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి ఎట్టి పరిస్థితిల్లోనూ ఆగష్ట్ 9నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు సాలిడ్ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్, తెలుగు-హిందీ శాటిలైట్ రైట్స్ మొత్తం 24 కోట్లకు డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. మరి నాన్ థియేట్రికల్ రైట్సే ఇంత భారీగా అమ్ముడుపోతే.. థియేట్రికల్ రైట్స్ ఇంకెంత భారీగా అమ్ముడుపోతాయే.

కాగా ఈ సినిమాలో ఇంకా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here