ఆల్‌టైమ్ మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘ఆత్మీయులు’కు 50 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, 50 Glorified Years For AAthmeeyulu movie, Akkineni Nageswara Rao AAthmeeyulu Completes 50 Years, All time Musical Blockbuster Movie Aathmeeyulu Completes 50 Years, Nageswara Rao AAthmeeyulu Movie Completes 50 Years, Nageswara Rao AAthmeeyulu Successfully Completes 50 Years, Nageswara Rao AAthmeeyulu Telugu Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
All time Musical Blockbuster Movie Aathmeeyulu Completes 50 Years

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు హిట్ జోడీగా రాణించిన‌ కథానాయికల్లో కళాభినేత్రి వాణిశ్రీ ఒకరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘ఆత్మీయులు’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు `విక్ట‌రీ`మధుసూధనరావు రూపొందించిన ఈ సినిమాలో చంద్రమోహన్, విజయనిర్మల, చంద్రకళ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగభూషణం, ధూళిపాళ, సూర్యకాంతం, పద్మనాభం, ప్ర‌భాక‌ర్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. ఏయ‌న్నార్‌తో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్‌ను నిర్మించిన `అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్‌` అధినేత దుక్కిపాటి మధుసూధనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి దాశరథి, శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి గీత రచన చేయగా… సాలూరి రాజేశ్వరరావు అందించిన బాణీలు విశేషాదరణ పొందాయి. వాటిలో ముఖ్యంగా సి.నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన “అన్నయ్య కలలే పండెను”, “ఓ చామంతి ఏమిటే ఈ వింత” పాటలతో పాటు… శ్రీశ్రీ రచించిన “కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే”, దాశరథి రాసిన “మదిలో వీణలు మ్రోగే”, “చిలిపి నవ్వుల నిను చూడగానే” గీతాలు నిత్యనూతనంగా ఉంటాయి. అప్పట్లో ఘ‌న విజ‌యం సాధించిన ఈ మ్యూజిక‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌… ద్వితీయ‌ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. 1969 జూలై 17న విడుదలైన ‘ఆత్మీయులు’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=hL74AA89c-o]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here