విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. వచ్చే నెల 30 (ఆగష్ట్ 30) వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించేశారు. అంతేకాదు.. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఫస్ట్ సింగిల్ ను రేపు, టీజర్ ను 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. క్రైమ్ రైటర్ గా కనిపించే నాని.. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కలిగిన మహిళలతో నాని రివెంజ్ ప్లాన్ చేస్తాడట. అంతేకాదు.. ఈ సినిమాలో నాని తన హ్యూమర్ తో బాగా నవ్విస్తాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుందని సమాచారం.
కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.
[subscribe]
[youtube_video videoid=FMwGC9-TIhQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: