
ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 12


రెండు వారాలు విశ్రాంతి తీసుకోనున్న ‘వెంకీమామ’

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బన్నీ, సుక్కు మూవీ?

మహేష్ బాబు ‘అర్జున్’కు 15 ఏళ్ళు
జైపూర్ కు 'దర్బార్' టీమ్
ఫస్ట్ టైమ్ కాప్ గా నటించా -శ్రద్ధా కపూర్
జోడి మూవీ లో ఫ్రెంచ్ టీచర్
నాగచైతన్య తెలంగాణ కుర్రాడు
సెప్టెంబర్ లో 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
గూగుల్ ప్లేస్టోర్‌లో ‘సాహో ది గేమ్’
డూప్ లేకుండా యాక్షన్ సీన్స్
కాజల్ అగర్వాల్ అ ! మూవీ సీక్వెల్
సైమా లో కూడా ఈ సినిమాలదే హవా
ఎవరు, రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్

అందాదూన్ రీమేక్ లో?
యూరోప్ థియేటర్ లో సాహో ప్రదర్శన

‘భాగమతి’ దర్శకుడితో తమన్నా మూవీ?
ఒక వైపు గ్లామర్ రోల్స్ తో కనువిందు చేస్తూనే... మరోవైపు అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనూ అలరిస్తోంది తమన్నా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... తాజాగా ఓ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే... గత ఏడాది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘భాగమతి’తో ఆకట్టుకున్న దర్శకుడు అశోక్... తాజాగా మరో విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ రెడీ చేసాడట. ఈ నేపథ్యంలో... తమన్నాకు ఈ కథను నేరేట్ చేయడం... కథ నచ్చడంతో తమన్నా కూడా అంగీకారం తెలిపడం జరిగిందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే…

రెండు వారాలు విశ్రాంతి తీసుకోనున్న ‘వెంకీమామ’
అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు నాగ చైతన్య కాంబినేషన్‌లో ‘వెంకీమామ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే... రామోజీ ఫిల్మ్ సిటీలో పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో... వెంకీ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. కొన్ని డ్యాన్స్ మూవ్స్ చేస్తుండగా వెంకటేష్ కాలు బెణికిందట. అయితే... గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారట. దాంతో వెంకీ పూర్తిగా కోలుకున్న తరువాతే ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సన్నిహిత వర్గాలు…

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బన్నీ, సుక్కు మూవీ?
`ఆర్య`, `ఆర్య 2` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీకి జోడీగా రష్మిక మందన నటించనుంది. కాగా... ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నుంచి మొదలవుతుందని టాక్. త్వరలోనే బన్నీ-సుక్కు మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు…

బాలయ్య, పూరి కాంబినేషన్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
కథానాయకులను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరే వేరు. తొలి చిత్రం `బద్రి` నుంచి తాజా చిత్రం `ఇస్మార్ట్ శంకర్` వరకు ఇదే శైలిని కొనసాగించాడు పూరి. ఇదిలా ఉంటే... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో చేయనున్న పూరి... ఆ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్నాడని టాక్. `పైసా వసూల్` సమయంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే... దాదాపు రెండేళ్ళ తరువాత అది కార్యరూపం దాల్చనుందని టాక్.

మహేష్ బాబు ‘అర్జున్’కు 15 ఏళ్ళు
తెలుగునాట బ్రదర్ - సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందాయి. అయితే, కవలలైన అక్క - తమ్ముడు కథలతో సినిమాలు తెరకెక్కడం అరుదనే చెప్పాలి. అలాంటి చిత్రమే... ‘అర్జున్’. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించాడు. ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్, గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో మహేష్‌కి కవల సోదరిగా కీర్తి రెడ్డి నటించగా... శ్రియ కథానాయికగా నటించింది. రాజా, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. సుదీర్ఘ విరామం అనంతరం సీనియర్ యాక్ట్రస్…
జైపూర్ కు 'దర్బార్' టీమ్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే రజినీకాంత్ లుక్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. చిత్ర యూనిట్ జైపూర్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. రజినీకాంత్, నయన తార ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.
నెటిజెన్ కు మాధవన్ స్ట్రాంగ్ కౌంటర్ - నీ రెస్పెక్ట్ నాకు అవసరం లేదు
సోషల్ మీడియా లో సెలబ్రిటీలపై నెటిజెన్ లు కామెంట్స్ చేయడం కామన్ థింగ్ అయిపోయింది. చిన్న పాయింట్ దొరికిందా ఆడేసుకుంటారు. మరి సెలబ్రిటీస్ ఏమన్నా తక్కువ.. కొంతమంది చూసీ చూడనట్టు వదిలేసినా.. కొంతమంది మాత్రం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా మాధవన్ కూడా ఓ నెటిజెన్ కు అలాంటి స్ట్రాంగ్ కౌంటర్ నే ఇచ్చాడు. ఇంతకు ఏ విషయంలో అనుకుంటున్నారా?
ఫస్ట్ టైమ్ కాప్ గా నటించా -శ్రద్ధా కపూర్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన హిందీ మూవీ చిచ్చోరే సెప్టెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ లో శ్రద్ధా బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. రెండు మూవీస్ ప్రమోషన్స్ లో అలసి పోతున్నా, ఎగ్జైటింగ్ గా ఉన్నానని, రెండు మూవీస్ డిఫరెంట్ గా ఉంటాయని, తక్కువ గ్యాప్ తో తాను నటించిన రెండు మూవీస్ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని శ్రద్ధా కపూర్ అన్నారు.
జోడి మూవీ లో ఫ్రెంచ్ టీచర్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళ, కన్నడ మూవీస్ తో బిజీగా ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు లో తన అప్ కమింగ్ మూవీ జోడి లో ఫ్రెంచ్ టీచర్ గా నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం జోడి మూవీ కి సైన్ చేశానని, ఆ మూవీ లో క్యారెక్టర్ కై ఎక్కువ ప్రిపేర్ కాలేదని, స్పాంటేనియస్ గా నటించానని, టాలీవుడ్ లో తన ఫస్ట్ మూవీ గా రిలీజ్ కావాల్సిఉంది అన్నారు.
నాగచైతన్య తెలంగాణ కుర్రాడు
ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్, P రామ్ మోహన్ రావు నిర్మాతలుగా నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో హీరో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడు గా నటించనున్నారు. తన క్యారెక్టర్ కై నాగచైతన్య ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ స్లాంగ్ ను నేర్చుకుంటున్నారు.
సెప్టెంబర్ లో 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
ఆది సాయికుమార్ హీరో గా 'వినాయకుడు'.. 'కేరింత' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ దర్శకత్వం లో 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' అనే సినిమాను తెరకెక్కిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతుందని చెప్పొచ్చు. గతంలో ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కాని అది కుదరలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అన్ని కార్యక్రమాలు ముగించుకొని సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
గూగుల్ ప్లేస్టోర్‌లో ‘సాహో ది గేమ్’
‘సాహో’.. దాదాపు ఇంకో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ను ఎప్పుడప్ప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది చిత్ర యూనిట్. ఒక పక్క ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా రోజుకో అప్డేట్ ఇస్తూనే.. మరో పక్క పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
డూప్ లేకుండా యాక్షన్ సీన్స్
UV క్రియేషన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు ఆ మూవీ తరువాత నటించే మూవీస్ గురించి ప్రెజర్ పడింది. ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సాహో మూవీ లోని రిస్కీ యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా నటించారు.
అడవి శేష్ ‘ఎవరు’ కలెక్షన్స్..చిన్న సినిమా పెద్ద హిట్.
మొత్తానికి అడివి శేష్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే క్షణం, గూఢచారి హిట్ల తో ఫుల్ ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆగష్ట్ 15 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. గతంలో అడవి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నా..ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ రూ. 62 లక్షలు మాత్రమే. అయితే ఈ రికార్డు ‘ఎవరు’ తుడిచిపెట్టేయడమే కాదు… మూడు రెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 1.65 కోట్ల డిస్ట్రిబ్యూటర్…
కాజల్ అగర్వాల్ అ ! మూవీ సీక్వెల్
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల ప్రధాన తారాగణం గా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ అ ! మూవీ 2018 వ సంవత్సరంలో రిలీజయి విజయం సాధించింది. సైకలాజికల్ ఇష్యూస్, సోషల్ ప్రోబ్లమ్స్ ఇతివృత్తంతో రూపొందిన అ ! మూవీ 66వ నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ ఎఫెక్ట్స్ బెస్ట్ మేకప్ అవార్డ్స్ గెలుచుకొంది.
సైమా లో కూడా ఈ సినిమాలదే హవా
రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ లో మన తెలుగు సినిమాలు రంగస్థలం, మహానటి సినిమాలు అవార్డ్స్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు సైమా అవార్డ్స్ లో కూడా ఈ సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో సైమా అవార్డ్స్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి పాత తరం, నేటి తరం సెలెబ్రిటీలంతా హాజరువుతున్నారు. ఇక ఈ అవార్డ్స్ లో మహానటి, రంగస్థలం చిత్రాలు మరోసారి సత్తా చాటాయి. ఉత్తమ నటుడు(రామ్ చరణ్), ఉత్తమ దర్శకుడు(సుకుమార్),ఉత్తమ సహాయనటి(అనసూయ),ఉత్తమ గేయరచయిత(చంద్రబోస్) ఇలా మొత్తం 9విభాగాలలో రంగస్థలానికి అవార్డులు దక్కాయి.
ఎవరు, రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్
క్షణం, గూఢచారి సినిమాల తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు ఎవరు అనే థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న విడుదల చేసిన ఎవరు సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. అడివి శేష్ కెరీర్ లోనే ఈ సినిమా హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని అందించింది. మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.7కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వా, సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన రణరంగం మూవీ కూడా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ మనసు గెలుచుకుంటున్న రవి
ఎన్ని రియాల్టీ షో లు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు. ఎందుకంటే.. నచ్చినా చూస్తారు.. నచ్చకపోయినా తిట్టుకుంటూ మరి చూస్తారు. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 లు సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వగా... ప్రస్తుతం బిగ్ బాస్ 3 రన్ అవుతుంది. ఇక ఈ సీజన్లో ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ వాళ్లకు వుంటారు. కానీ ప్రతి సీజన్ లో ఎవరో ఒకళ్ళు మాత్రం అందరి ఫేవరెట్ గా వుంటారు. అలా ఈ సీజన్లో అటు హౌస్ మేట్స్ తో పాటు ఇటు ఆడియన్స్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా వున్నారంటే అది రవి అని చెప్పొచ్చు. మొదట్లో తాను వున్నాడా అసలు అన్నట్టు వున్న రవి తమన్నా పెట్టిన టార్చర్ తో ఒక్కసారిగా హీరో ఐపోయాడు. తమన్నా తనను…

అందాదూన్ రీమేక్ లో?
ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమా ను కూడా తమిళ్ లో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.
యూరోప్ థియేటర్ లో సాహో ప్రదర్శన
ఇప్పటికే సాహో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. టీజర్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఎప్పుడు తాజాగా మరో రికార్డు ను సొంతం చేసుకుంది. యూరోప్ లోని ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. ఇప్పటికే సౌత్ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు.