‘భాగమతి’ దర్శకుడితో తమన్నా మూవీ?

2019 Latest Telugu Film News,Tamannaah To Work With Bhaagamathie Director, Bhaagamathie Director To Work With Tamannaah, Tamannaah Next Project, Tamannaah Latest Movie News, Tamannaah Ropped An interesting Opportunity, Tamannaah Role In Bhaagamathie Director Movie Role, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

ఒక‌ వైపు గ్లామర్ రోల్స్ తో క‌నువిందు చేస్తూనే… మరోవైపు అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనూ అల‌రిస్తోంది త‌మ‌న్నా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… తాజాగా ఓ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఆ వివరాల్లోకి వెళితే… గత ఏడాది హీరోయిన్ ఓరియెంటెడ్‌ మూవీ ‘భాగమతి’తో ఆకట్టుకున్న దర్శకుడు అశోక్… తాజాగా మ‌రో విమెన్ సెంట్రిక్ స‌బ్జెక్ట్ రెడీ చేసాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో… తమన్నాకు ఈ కథను నేరేట్ చేయ‌డం… కథ నచ్చడంతో త‌మ‌న్నా కూడా అంగీకారం తెలిపడం జ‌రిగింద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం తమన్నా నటించిన తెలుగు చిత్రాలు ‘దటీజ్ మహాలక్ష్మి’, ‘సైరా నరసింహారెడ్డి’… తమిళ చిత్రం ‘పెట్రోమాక్స్’ (తెలుగు ‘ఆనందోబ్రహ్మ’కు రీమేక్) పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అలాగే మరో తమిళ చిత్రం ‘యాక్షన్’, హిందీ మూవీ ‘బోలె చూడియాన్’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అదే విధంగా మ‌ల‌యాళంలోనూ ఓ హార‌ర్ మూవీలో ఈ మిల్కీ బ్యూటీ న‌టించ‌బోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=Fq-4d3hXTPw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =