‘సాహో’.. దాదాపు ఇంకో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ను ఎప్పుడప్ప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది చిత్ర యూనిట్. ఒక పక్క ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా రోజుకో అప్డేట్ ఇస్తూనే.. మరో పక్క పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్ లో భాగంగానే.. ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఫుల్ గేమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందు.. ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు ‘సాహో ది గేమ్’ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. గేమ్ ఆడాలనుకునే వారు గూగుల్ ప్లేలోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్నీ యూవీ క్రియేషన్స్ వారు తమ ట్విటర్ ద్వారా తెలిపారు.
The wait is over! #SaahoTheGame is now available on Google Play Store too! 👊🏻
Download here : https://t.co/64yhK5xU4P
Developed by : @PixalotLabs pic.twitter.com/6mHh2f3oYN
— UV Creations (@UV_Creations) August 16, 2019
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, లాల్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది.
[youtube_video videoid=TmbYI3WmJj0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.