రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ లో మన తెలుగు సినిమాలు రంగస్థలం, మహానటి సినిమాలు అవార్డ్స్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు సైమా అవార్డ్స్ లో కూడా ఈ సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో సైమా అవార్డ్స్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి పాత తరం, నేటి తరం సెలెబ్రిటీలంతా హాజరువుతున్నారు. ఇక ఈ అవార్డ్స్ లో మహానటి, రంగస్థలం చిత్రాలు మరోసారి సత్తా చాటాయి. ఉత్తమ నటుడు(రామ్ చరణ్), ఉత్తమ దర్శకుడు(సుకుమార్),ఉత్తమ సహాయనటి(అనసూయ),ఉత్తమ గేయరచయిత(చంద్రబోస్) ఇలా మొత్తం 9విభాగాలలో రంగస్థలానికి అవార్డులు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహానటికి గాను ఉత్తమ చిత్రం(మహానటి), ఉత్తమ నటి(కీర్తి సురేష్), ఉత్తమ సహాయ నటుడు( రాజేంద్ర ప్రసాద్) విభాగాలలో మూడు అవార్డులు దక్కాయి.
సైమా అవార్డ్స్ లో విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ నటుడు : రామ్‌చరణ్ (రంగస్థలం)
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే – రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా – ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ – రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్‌పుత్ (ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం)
సోషల్ మీడియాలో పాపులరైన స్టార్ : విజయ్ దేవరకొండ
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
[youtube_video videoid=cI5d2qpP46Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: