ఫస్ట్ టైమ్ కాప్ గా నటించా -శ్రద్ధా కపూర్

2019 Latest Telugu Film News,Shraddha Kapoor first time as a Cop, Shraddha Kapoor to play a cop for the first time, honour for me to represent the police Shraddha Kapoor, Saaho movie Latest news, Shraddha Kapoor Role In Saaho Movie, Shraddha Kapoor Cop Role In saaho Movie, Shraddha Kapoor on playing a cop in Saaho, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, shraddha kapoor act as a cop in saaho movie for the first time in her career
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన హిందీ మూవీ చిచ్చోరే సెప్టెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ లో శ్రద్ధా బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. రెండు మూవీస్ ప్రమోషన్స్ లో అలసి పోతున్నా, ఎగ్జైటింగ్ గా ఉన్నానని, రెండు మూవీస్ డిఫరెంట్ గా ఉంటాయని, తక్కువ గ్యాప్ తో తాను నటించిన రెండు మూవీస్ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని శ్రద్ధా కపూర్ అన్నారు. ఫస్ట్ టైమ్ కాప్ గా నటించానని, గన్ ను ఎప్పుడూ ఉపయోగించలేదని, ఒక కాప్ గా ప్రొటెక్షన్ గురించి ఉపయోగించాల్సి ఉంటుందని, గన్ ను కరెక్ట్ గా హోల్డ్ చేసి ఫైరింగ్ చేయడం ఏ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. సెట్స్ లోనే గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేసేదానినని, తాను గన్ తో కంఫర్ట్ గా ఉన్నపుడే యాక్షన్ సీన్స్ షూటింగ్ జరిగిందని, తనకున్న యాక్షన్ సీన్స్ బెస్ట్ గా ట్రై చేసానని, రాత్రిళ్ళు మేలుకొని డైలాగ్స్ నేర్చుకొనేదానినని, షూటింగ్ టైమ్ లో దర్శకుడి తో రిహార్సల్ చేసేదానినని, ఒక కోచ్ కూడా హెల్ప్ చేసారని శ్రద్ధా తెలిపారు. ఫస్ట్ డే షూటింగ్ లో ప్రభాస్ కూల్ గా ఉండి, తన వర్క్ ఈజీగా ఉండేట్టు చేశారని, చిత్ర యూనిట్ తాను కంఫర్ట్ గా ఉండేట్టు చూసుకున్నారని, ప్రభాస్ హిందీలో మాట్లాడుతూ, తనకు తెలుగు కూడా నేర్పారని, తనకు సింగింగ్ అంటే ఇష్టమని, కానీ మూవీ క్యారెక్టర్స్ పై ఫోకస్ పెట్టానని అన్నారు. 2020 సంవత్సరానికి 10 సంవత్సరాల సినీ కెరీర్ కంప్లీట్ అవుతున్నందుకు సంతోషం గా ఉందని, స్ట్రీట్ డాన్సర్ లో నటిస్తున్నానని, బాఘీ 3 మూవీ కి సైన్ చేశానని నని శ్రద్ధా కపూర్ తెలిపారు.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=tLSStJweGGU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − five =