అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు నాగ చైతన్య కాంబినేషన్‌లో ‘వెంకీమామ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే… రామోజీ ఫిల్మ్ సిటీలో పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో… వెంకీ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. కొన్ని డ్యాన్స్ మూవ్స్ చేస్తుండగా వెంకటేష్ కాలు బెణికిందట. అయితే… గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారట. దాంతో వెంకీ పూర్తిగా కోలుకున్న తరువాతే ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=tpu-lZ3oEUg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: