ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్, P రామ్ మోహన్ రావు నిర్మాతలుగా నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో హీరో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడు గా నటించనున్నారు. తన క్యారెక్టర్ కై నాగచైతన్య ప్రిపేర్
అవుతున్నారు. తెలంగాణ స్లాంగ్ ను నేర్చుకుంటున్నారు.
ఆగస్ట్ నెలాఖరున షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ లో సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్ పాత్రలో నటించడం విశేషం.శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో తెలంగాణ నేపథ్యం లో రూపొందిన ఫిదా మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది. వారిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ రెండవది. ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ ఈ మూవీ ద్వారా నిర్మాణ రంగం లో అడుగుపెడుతున్నారు. కొత్త కొత్త
కాంబినేషన్స్ లో రూపొందనున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: