ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన ‘అందాదూన్’ సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమా ను కూడా తమిళ్ లో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకు ఈ రీమేక్ లో నటించే హీరో ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు ప్రశాంత్. జీన్స్ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్. ఇక చాలా గ్యాప్ తేరుకున్న ప్రశాంత్ ఇటీవల తెలుగులో వినయ విధేయ రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తమిళ్ లో అందాదూన్ రీమేక్ లో నటిస్తున్నట్టు సమాచారం. దీనికి కారణం ప్రశాంత్ ఫాదర్ త్యాగరాజన్ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోవడమే. దానికితోడు ప్రశాంత్ ట్రైన్డ్ పియానో ప్లేయర్. అందుకే ప్రశాంతే ఎక్కువగా ఈ సినిమా రీమేక్ లో నటించే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
[youtube_video videoid=WFEYQkf-Pg4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: