తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం…దిగ్గజ నటుడు గిరిబాబు కన్నుమూత

Veteran Actor Giribabu Passes Away

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 1943 జూన్ 8న జన్మించిన గిరిబాబు, ‘జగమే మాయ’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. కెరీర్ ప్రారంభంలో కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత ప్రతినాయకుడిగా మరియు సహాయ నటుడిగా వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ఎంతో పేరు సంపాదించారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 600లకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

నటుడిగానే కాకుండా చిత్ర నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టిన ఆయన ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజీత్’ వంటి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ‘రణరంగం’, ‘ఇంద్రజీత్’, ‘నీ సుఖమే నే కోరుకున్న’ తదితర చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.

గిరిబాబు సతీమణి 2016లోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, వారిలో రఘుబాబు ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. మరొక కుమారుడు బోసుబాబు. కాగా, 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం గిరిబాబు నటించి తెరపై కనిపించిన చివరి సినిమాగా నిలిచింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.