ఆకాశంలో ఒక తార చాలా గొప్ప కథ – అల్లు అర్జున్ 

Allu Arjun Says Aakasamlo Oka Tara Has a Wonderful Story

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా  ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమ, అభిమానానికి థాంక్యూ. ఒక ఆర్మీలా నా వెనుక ఉండి నన్ను ప్రేమించే నా ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్‌ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. నాకు దుల్కర్ గారంటే చాలా ఇష్టం.  మలయాళం, తమిళం, హిందీ, తెలుగు ఇలా అన్నీ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ ఇలా ఆయన విజయాలు కొనసాగుతున్నాయి. ఆయన వెర్సటైల్ యాక్టర్. సినిమాల ఎంపిక కూడా చాలా బాగుంటుంది. చాలా స్వీట్ పర్సన్, వండర్‌ఫుల్ పర్సన్. కేరళలో మెగాస్టార్ మమ్ముట్టి గారి అబ్బాయి అయినప్పటికీ చాలా హంబుల్‌గా ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. . అదే ఆయనకు మంచి సక్సెస్‌ను తీసుకొస్తుంది. నిర్మాతగా కూడా ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన నిర్మించిన ‘లోక’ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఆకాశంలో ఒక తార ఆయన కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుంది  ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్న సాత్వికకు ఆల్ ది బెస్ట్. వెల్ కం టు తెలుగు సినిమా. శ్రుతి హాసన్ లాంటి కమర్షియల్ స్టార్ ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రుహాని కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. జీవీ ప్రకాష్ గారు ‘ఇరుముడి’, ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథన్’ ఇలా వరుసగా మంచి సినిమాలు, విజయాలు అందిస్తున్నారు.  

పవన్ సాధినేని తొలి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చాలా అద్భుతంగా తీశాడు. తనను పిలిపించి మాట్లాడాను. తను చాలా టాలెంటెడ్ డైరెక్టర్. సరైన సమయం వచ్చినప్పుడు తన టాలెంట్‌ను నిరూపించుకుంటాడని అనిపించింది. ఈ సినిమాలో ఆ ఎనర్జీ కనిపిస్తోంది. మా నాన్నగారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. విద్యా అక్క సీఈవోగా ఉన్నారు. స్వప్న గారు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.  దత్తు గారి లెగసీని వారు ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. వాళ్లు చాలా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్నారు. వారి విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. గుణ్ణం గంగరాజు గారి కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వారికి ఆల్ ది బెస్ట్. మా నాన్నగారు చాలా సినిమాలు చూస్తుంటారు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మామూలుగానే ఉంటారు. కానీ ఈ సినిమా చూసి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సినిమా చాలా బాగుందని, మనసుకు బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఎప్పుడో కానీ అలా చెప్పరు. నా సినిమాల గురించి కూడా అంతగా చెప్పరు. అలాంటిది ఈ సినిమా గురించి అలా అన్నారంటే కచ్చితంగా ఇందులో మంచి సోల్ ఉందని అర్థం. ఈ సినిమాలో మొత్తం పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.  ప్రతి అమ్మాయి కల నెరవేరాలనేది ఇందులోని ప్రధాన అంశం. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అభిమానులందరికీ థాంక్యూ.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.