దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’కి సంబంధించి చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మేకర్స్ . సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (సి.జి) పనులతో పాటు రీ-రికార్డింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
V@VaranasiMovie
Shooting ayipoyindi. Post Production avuthundi… CG works going on. RR Going on… Dubbing start cheyyaali… If you think this is an update, its an update. If not, you have to wait for a bit for the blast.💥 ☄️
అయితే ఈ అప్‌డేట్‌తో పాటు చిత్ర బృందం ఇచ్చిన చిన్న హింట్ అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. “ఇది కేవలం అప్‌డేట్ మాత్రమే అనుకుంటే.. అసలైన బ్లాస్ట్ కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే” అంటూ మేకర్స్ పేర్కొనడంతో, త్వరలోనే రాజమౌళి ఏదైనా భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వారణాసి థియేటర్లలోకి రానుంది.