వరుస బ్లాక్‌బస్టర్స్‌తో అలరిస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. గ్లింప్స్‌కు ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి స్పందన రాగా, ఫస్ట్ సింగిల్ భజ గోవిందం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జీవితంలో చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలనే అందమైన భావనతో రూపొందిన ఈ పాట శ్రోతలకు వెంటనే కనెక్ట్ అయి వైరల్‌గా మారింది.
ఇప్పుడు మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరోస్థాయికి తీసుకెళ్తూ మేకర్స్ రెండో సింగిల్ ‘రుత్తూ’ను విడుదల చేశారు. ఈ పాట ‘రియాలిటీ’లోని రొమాంటిక్ కోణాన్ని అందంగా ఆవిష్కరిస్తుంది. వినసొంపైన మెలోడీగా, మనసుకు హాయినిచ్చేలా ఈ పాట సాగుతుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం కొత్త అనుభూతిని ఇస్తుంది. అద్భుతమైన ఇన్‌స్ట్రుమెంటేషన్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పూర్ణాచారి రాసిన సాహిత్యం కవితాత్మకంగా సాగుతూ, తన ప్రేయసిపై హీరోకు ఉన్న ప్రేమను, ఆమెతో ఉన్నప్పుడు కలిగే ఆనందాన్ని, ప్రతి క్షణం ఆమెతోనే గడపాలనే ఆరాటాన్ని అందంగా ఆవిష్కరించింది. ప్రేమలోని భావాలను వ్యక్తపరిచిన తీరు మరింత అందంగా చూపిస్తుంది.
కపిల్ కపిలన్ బ్యూటీఫుల్ వోకల్స్ పాటకు మరింత ప్రాణం పోశారు. ఎం. షరీఫ్ చేసిన గ్రేస్‌ఫుల్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. చాలా సింపుల్ మూవ్‌మెంట్స్ కూడా ఎంతో అందంగా కనిపించాయి. ముఖ్యంగా పాటలోని క్యాచీ హుక్ స్టెప్ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్‌లో ట్రెండ్ అయ్యేలా ఉంది.
కిరణ్ అబ్బవరం తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. పక్కింటి కుర్రాడిలా కనిపించే పాత్రలో తనదైన చార్మ్‌తో ఆకట్టుకున్నారు. దేవిక భట్ అందంగా కనిపిస్తూ, తన స్క్రీన్ ప్రెజెన్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటకు మరింత మ్యాజిక్ తీసుకొచ్చారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కిరణ్ తన ఆనందాన్ని వ్యక్తపరచడం, దేవికకు పానీపూరీ తినిపించడం వంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఎంతో ముచ్చటగా అనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేమకథలోని మ్యాజిక్ ప్రేక్షకులకు ఒక అందమైన అనుభూతిని అందిస్తుంది.
మొత్తంగా ‘రుత్తూ’ విజువల్స్ పరంగా కూడా ఒక మంచి మ్యాజికల్ ట్రీట్. వెంటనే ఆకట్టుకునే మెలోడీ, క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్‌తో ఈ పాట ఫస్ట్ సింగిల్‌లాగే మరోసారి వైరల్ కానుంది. ‘రియాలిటీ’ మ్యూజికల్ ప్రమోషన్స్ వరుసగా ఆకట్టుకుంటుండటం చూస్తుంటే, ఈ సినిమా ప్రతి విషయంలోనూ కిరణ్ అబ్బవరం ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమవుతోంది.
ఈ సినిమాలో శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కామార్సు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ చిత్రం డిసెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























